House Burnt due to Simhadri Ramesh Nomination : కృష్ణ జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. నామినేషన్ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు పేల్చిన బాణసంచా వల్ల తెలుగుదేశం నేత ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు నామినేషన్ ర్యాలీలో ఈ అపశృతి జరిగింది. కార్యకర్తలు పేల్చిన బాణసంచా నిప్పురవ్వలు పడి టీడీపీ నేత యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా దగ్ధమైంది.
టీడీపీ నేతపై ఎస్సై దురుసు ప్రవర్తన - విచారణకు ఆదేశించిన ఎస్పీ - SI insulted TDP leade
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. ఎమ్మెల్యేతో ఇంటి స్థలం విషయంలో ఉన్న వివాదం వల్లే కావాలనే ఇంటికి నిప్పంటించారని బాధితుడు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ తనను వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడు తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారుల ప్రోద్బలంతో పలుమార్లు స్థలాన్ని ఖాళీ చేయించేందుకు యత్నించారన్నారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక రెండు నెలల కిందట తన సోదరుడు మరణించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. టీడీపీ నాయకుడు మండలి వెంకట్ బాధితులను పరామర్శించారు.
Nomination of Simhadri Ramesh : అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యాసం శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో కొనసాగుతున్నాయి. వివాదాలు నడుమ గ్రామ పంచాయతీ అధికారుల ప్రోద్బలంతో పలుమార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం ఆ వత్తిడి తట్టుకోలేక రెండు నెలలంక్రితం యాసం శ్రీనివాసరావు మృతి చెందాడు. ఇంట్లో ప్రస్తుతం ఎవ్వరు నివాసం ఉండకపోవడంతో ప్రాణా ప్రాయం తప్పింది. మా ఇంటి మీదకు కావాలని మందు గుండు సామాగ్రి వేసారని కావాలని ఇళ్లు తగలబెట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు మండలి వెంకట్ రామ్ బాధికతులను పరామర్శించి దైర్యం చెప్పారు. అవనిగడ్డలో అగ్నిమాపక కేంద్రం నుండి ఈ నివాస గృహం కేవలం కిలోమీటరు దురంలోపల మాత్రమే ఉన్నది. ఈ ఇంటికి నిప్పు అంటూకోగానే మోపిదేవి మండలం, బొబ్బర్లంకలో కరకట్ట ప్రక్కన చెత్త తగలబడుతుంది అని పోన్ రావడం ఫైర్ వాహనం వెళ్లటం, మరో అయిదు నిమిషాల్లో ఫైర్ వాహనం తిరిగిరావడం ఇదంతా చూసిన వారికి ఏమి జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.