TDP Leader Dhulipalla Narendra : పొన్నూరులో ఫామ్ 6 దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరు సజ్జల అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. మంగళగిరికి ఓటు బదిలీ చేసుకోడానికి ఫామ్ - 8 దరఖాస్తు చేయాలి కదా అని ప్రశ్నించారు. బదిలీ చేసుకోకుండా మళ్లీ మంగళగిరిలో నూతన ఓటు కావాలని ఫామ్ - 6 ఎందుకు దరఖాస్తు చేశారని నిలదీశారు.
రెండుచోట్ల దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరని, రెండుచోట్లా ఓటు దరఖాస్తు చేయడం నేరం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టప్రకారం ఇలా శిక్షార్హులు కాదా అని అన్నారు. అడ్డంగా దొరికిపోయాక ఫామ్ - 7 బయటపెట్టడం విడ్డూరమన్నారు. గోబెల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రెండు ఓట్లతో అడ్డంగా దొరికిన సజ్జల - దొంగఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథ, స్క్రీన్‌ప్లే: ధూళిపాళ్ల
ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ప్రచారం చేయడంలో సజ్జల దిట్ట అని అన్నారు. ఈసీ (EC)కి ఫిర్యాదు చేసి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోరతామని ధూళిపాళ్ల వెల్లడించారు. రెండుచోట్ల ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసి సజ్జల కుటుంబం (Sajjala Family) నేరానికి పాల్పడిందని, తప్పుడు సమాచారమిచ్చినందుకు సజ్జలపై, సెక్షన్ 30ప్రకారం ఎన్నికల సంఘం, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ ధూళిపాళ్ల చేశారు.
పొన్నూరు, మంగళగిరి ఈఆర్వోలపైన కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల అక్రమాల్లో కథ, స్క్రీన్‌ప్లే అంతా సజ్జలేనని ఆరోపించారు. సీఎం క్యాంప్ క్లర్ల్క్ (CM Camp Clerk) అయినంత మాత్రాన ఎన్నిచోట్లయినా ఓటు హక్కు కల్పిస్తారా అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుచేసినట్లు సజ్జల తన ప్రకటన ద్వారా ఒప్పుకున్నారన్నారు.
'రాష్ట్రంలో నయా దోపిడీ పాలన- దొంగ బిల్లులు సృష్టించి దందా'
పొన్నూరులో దరఖాస్తు చేసిన 15 రోజులకే మంగళగిరిలో దరఖాస్తు చేశారని అని తెలిపారు. అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా బుకాయించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తప్పును ఒప్పుకోకుండా దరఖాస్తు చేసిన తేదీలను మార్చి చెబుతున్నారని మండిపడ్డారు. గత సంవత్సరం నవంబర్ నెల 13వ తేదీన పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు చేశారని, అదే నెలలో 27 వ తేదీని మంగళగిరి నియోజకవర్గంలో ఓటు కావాలని దరఖాస్తు చేసినట్లు తమకు సమాచారముందని ధూళిపాళ్ల వివరించారు.
చిరునామా మార్పు కోసం ఫామ్ - 8 దరఖాస్తు చేయాలని సజ్జలకు తెలియదా అని ప్రశ్నించారు. ఓటమి తెలిసే మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రాగాన్ని అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకున్నది దాచుకోవడానికేనా పక్క రాష్ట్రంలో రాజధాని అంటున్నారని విమర్శించారు.
వైసీపీ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు - స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం: ధూళిపాళ్ల