ETV Bharat / state

కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పిటిషన్​ దాఖలు- హైకోర్టులో అప్పిల్​ వేసిన టీడీపీ నేత - BTech Ravi Petition on High Court

TDP Leader BTech Ravi Petition on High Court: వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌ను తాము విచారించలేమని మరో ధర్మాసనం విచారిస్తుందని బెంచ్‌ పేర్కొంది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటిషనర్​ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

TDP Leader BTech Ravi Petition on High Court

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 7:00 PM IST

TDP Leader BTech Ravi Petition on High Court: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై ఎవరు మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్సార్‌ జిల్లా పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టులో లంచ్‌మోషన్‌ అప్పిల్ చేశారు. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను విచారించలేమని రేపు మరో ధర్మాసనం చేపడుతుందని బెంచ్‌ పేర్కొంది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటీషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం బ్లూమ్ బర్గ్‌కేస్‌లో ఇచ్చిన తీర్పుకు ఇది పూర్తి విరుద్ధమని పిటిషనర్‌ తెలిపారు.

కేసుల వివరాలివ్వడానికి ఎంత సమయం కావాలి: హైకోర్టు - Cases on Political Leaders

ఎన్నికల సందర్భంగా వివేకా హత్య కేసుపై పలువురు రాజకీయ నాయకులు ప్రచారంలో మాట్లాడుతున్నారని వైసీపీ కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టులో వేసిన పిటిషన్​పై 30వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ప్రధానంగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని పిటిషన్ వేయగా వారందరూ వివేకా అంశాన్ని ప్రస్తావించవద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీటులో చేర్చినా నేటివరకూ న్యాయం జరగలేదని సునీత అన్నారు. ప్రజాకోర్టులో న్యాయం పొందే అవకాశం ఉండటంతో అడుగుతున్నామన్నారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు వచ్చినప్పుడు సీబీఐ పని సాఫీగా జరిగి ఉంటే అవినాష్‌రెడ్డిని జగన్‌ కాపాడకపోయి ఉంటే కేసుకు న్యాయం జరిగి ఉంటే హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్షలు పడి ఉంటే ఈ రోజు మేము రోడ్డు మీదకు వచ్చే అవసరమే ఉండేది కాదన్నారు.

వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట - high court on ys sunitha petition

ఐదు సంవత్సరాలు వేచి చూసినా మాకు న్యాయం జరగలేదని అందుకే ప్రజా తీర్పు కోసం ప్రజాకోర్టులో కొంగుచాచి న్యాయం అడుగుతున్నా ఇది తప్పెలా అవుతుంది? ప్రజల్నే తీర్పు చెప్పాలంటున్నాం. హత్య కేసులో నిందితులు వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత కూడా అవినాష్‌రెడ్డిని కలిశారని గూగుల్‌ టేకౌట్‌ మ్యాప్‌ల ఆధారంగా తెలుస్తోందని సీబీఐ స్పష్టంగా చెప్పిందని షర్మిల అన్నారు.

అప్పటివరకు వివేకా హత్య కేసు అంశం ప్రస్తావించొద్దు - కడప కోర్టు ఉత్తర్వులు - kadapa COURT in VIVEKA MURDER CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.