ETV Bharat / state

వర్రా రవీందర్‌రెడ్డికి ఆ పార్టీ నుంచే ప్రాణహాని : బీటెక్ రవి - BTECH RAVI ALLEGATIONS TO VARRA

ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ పులివెందుల ఇన్​ఛార్జ్​ బీటెక్​ రవి

BTECH_RAVI_ALLEGATIONS_TO_VARRA
BTECH_RAVI_ALLEGATIONS_TO_VARRA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 12:44 PM IST

TDP Leader BTech Ravi Allegations to YSRCP Varra Ravindra Reddy : పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి ఆ పార్టీ నాయకులే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని పులివెందుల టీడీపీ ఇన్​ఛార్జీ బీటెక్ రవి ఆందోళన వ్యక్తం చేశారు. వర్రా రవీందర్ రెడ్డికి ప్రాణహాని తలపెట్టి ఆ నెపాన్ని పోలీసుల పైకి నెట్టే ఆలోచన చేస్తున్నారనీ ఆరోపించారు. తమకు ఇబ్బంది కలుగుతుంది అంటే వైఎస్సార్సీపీ నాయకులు ఎంతటికైనా తెగిస్తారని వ్యాఖ్యానించారు.

వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ పరార్! - 'వర్రా' కేసులో రాఘవరెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని బీటెక్​ రవి డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుంచి అవినాష్ పీఏ రాఘవరెడ్డి తప్పించుకొని వర్రా రవీందర్ రెడ్డితో ఫోన్లో టచ్​లో ఉన్నాడని బీటెక్ రవి ఆరోపించారు. అవినాష్ పీఏ గతంలో అనేక అక్రమాలు కూడా చేశాడని పేర్కొన్నారు. రాఘవరెడ్డిని విచారిస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయనీ తెలియజేస్తూ తాజా పరిణామాలపై బీటెక్ రవి వీడియో విడుదల చేశారు.

సోషల్ మీడియా సైకో 'వర్రా' దొరికేశాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.