TDP-JanaSena First List Priority to Youth: శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం - జనసేన ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో యువతకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. శనివారం ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో 25-35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇద్దరు, 36-45 ఏళ్ల వయసున్న వారు 22 మంది ఉన్నారు. ప్రస్తుత జాబితాలో 45 సంవత్సరాలలోపు ఉన్న 24 మందీ టీడీపీ అభ్యర్ధులే ఉన్నారు.
Release First List Candidates: శింగనమల అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, మడకశిర అభ్యర్థి సునీల్ కుమార్ పిన్న వయస్కులు. శ్రావణిశ్రీ శాసనసభ ఎన్నికల బరిలో దిగడం ఇది రెండోసారి. 36-45 ఏళ్ల మధ్య వయసున్న టీడీపీ అభ్యర్థుల్లో భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), సొంగా రోషన్ (చింతలపూడి), గురజాల జగన్మోహన్ (చిత్తూరు), కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం), సరిపెళ్ల (మహాసేన) రాజేష్ కుమార్ (పి.గన్నవరం), బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), తోయక జగదీశ్వరి (కురుపాం), నారా లోకేశ్ (మంగళగిరి), గాలి భానుప్రకాశ్ (నగరి), తంగిరాల సౌమ్య (నందిగామ), వర్ల కుమార్ రాజా (పామర్రు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), బోనెల విజయ్ (పార్వతీపురం), వంగల పూడి అనిత (పాయకరావుపేట), కాగిత కృష్ణప్రసాద్ (పెడన), ఆదిరెడ్డి వాసు (రాజమహేంద్రవరం సిటీ), మండిపల్లి రామ్ ప్రసాదొడ్డి (రాయ చోటి), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), జేసీ అస్మిత్ రెడ్డి (తాడిపత్రి), యనమల దివ్య (తుని), పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు (విజయనగరం) ఉన్నారు. టీడీపీ ప్రకటించిన 94 సీట్లలో 25.53 శాతం యువతకు కేటాయించారు.
ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేన ఫోకస్ - భీమవరం నుంచే పవన్ !
TDP-Janasena Release First List: టీడీపీ, జనసేన అభ్యర్థుల్లో 46-60 ఏళ్ల మధ్య వయసున్న వారు 55 మందికాగా, 61-75 ఏళ్ల వయసున్న వారు 20 మంది ఉన్నారు. టీడీపీ అభ్యర్థుల్లో చంద్రబాబు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ పెద్ద వయసు వారే ఉన్నారు. టీడీపీ యువ అభ్యర్థుల్లో కొండపల్లి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎంపీ కొండపల్లి పైడి తల్లినాయుడి మనవడు, పూసపాటి అదితి గజపతిరాజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె. యనమల దివ్య టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తెకు టికెట్ ఇవ్వడం జరిగింది. వర్ల కుమార్ రాజా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు, అలాగే తంగిరాల సౌమ్య మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రావు కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కుమార్తె సవితను అభ్యర్థించారు. సొంగా రోషన్ ప్రవాసాంద్రుడు 18 ఏళ్లపాటు అమెరికాలోని వివిధ కంపెనీల్లో పనిచేశారు. స్వచ్చంద సంస్థ మిషన్హాప్ నడుపుతున్నారు. గురజాల జగన్మోహన్ స్థిరాస్తి వ్యాపారి కాగా భానుప్రకాశ్ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు సరిపెళ్ల రాజేష్ కుమార్ మహాసేన రాజేష్‌గా ప్రాచుర్యం పొందారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. తోయక జగదీశ్వరి ప్రస్తుతం ఎంపీటీసీగా, కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట
TDP-Janasena Female Candidates in First List: టీడీపీ, జనసేన అభ్యర్థుల్లో 13 మంది మహిళలున్నారు. తొలి జాబితాలో ప్రకటించిన 99 సీట్లలో 13 మహిళలకు కేటాయించారు. వీరిలో 12 మంది టీడీపీ అభ్యర్థులు, ఒకరు జనసేన అభ్యర్థి ఉన్నారు. టీడీపీ మహిళా అభ్యర్థుల్లో తోయక జగదీశ్వరి (కురుపాం), గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు (విజయనగరం), వంగలపూడి అనిత (పాయకరావుపేట), యనమల దివ్య (తుని), తంగిరాల సౌమ్య (నందిగామ), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), రెడ్డప్పగారి మాధవీరెడ్డి (కడప), గౌరు చరితారెడ్డి (పాణ్యం), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), బండారు శ్రావణిశ్రీ (శింగనమల), పరిటాల సునీత (రాప్తాడు), సవిత (పెనుగొండ) ఉన్నారు. జనసేన తొలి జాబితాలో నెల్లిమర్ల టిక్కెట్ మహిళలకు కేటాయించగా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నారు.