TDP Chief Chandrababu Naidu Return From Foreign Tour : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబబు దాదాపు పది రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు పది రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు.
గత రెండు నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరికలేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుట పడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియటంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌటింగ్ వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు.
కౌటింగ్ సమయం దగ్గర పడుతుడంటంతో వీదేశీ పర్యటనలో ఉన్ననేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో పలికిన టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. విశ్రాంతి కోసం ఈనెల 19న విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
భువనేశ్వరితో చంద్రబాబు విదేశీ పర్యటన - వారం రోజుల పాటు అమెరికాలోనే - Chandrababu foreign Tour