ETV Bharat / state

ఆస్తి పన్ను మరో 15 శాతం పెంపు ! - జనానికి వాతలు పెట్టేందుకు సిద్ధమైన జగన్‌ - Tax Burden on AP People

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 9:21 AM IST

Tax Burden on People in YSRCP Govt: నాడు ఇదేం పాలన అన్నారు. పౌరులపై పన్నుల భారమంటూ మొసలి కన్నీరు కార్చారు. తనను గెలిపిస్తే పన్నుల బాదుడు ఉండదన్నారు. కానీ ఆయన ఆయనదంతా రివర్స్‌ పంథా. గుక్కతిప్పుకోనివ్వకుండా బాదుతూ పన్నులు కట్టించుకుంటున్నారు. ఆస్తి పన్నులో నాలుగేళ్లుగా మోత మోగించిన జగన్‌ దిగిపోయే సమయంలోనూ ఐదో ఏడాదికి 15 శాతం పెంపుతో బిల్లులు సిద్ధం చేయించారు.

Tax_Burden_on_People_in_YSRCP_Govt
Tax_Burden_on_People_in_YSRCP_Govt
ఆస్తి పన్ను మరో 15 శాతం పెంపు ! - జనానికి వాతలు పెట్టేందుకు సిద్ధమైన జగన్‌

Tax Burden on People in YSRCP Govt: ప్రజలను అడ్డమైన పన్నులతో పీడించిన పాలకుడి ప్రస్తావన వస్తే ఇప్పటివరకు ఔరంగజేబు గుర్తుకొస్తారు. ఐదేళ్ల పాలనలో చెత్త పన్నులన్నీ వేసి ప్రజల్ని హింసించిన జగన్‌ ఆ ఔరంగజేబునే మించిపోయారు. ఐదేళ్లుగా జనం రక్తం పీల్చేయడమే ఎజెండాగా పాలించిన జగన్‌ మరోసారి ఆస్తి పన్ను పెంపుతో పట్టణాల్లోని ప్రజలకు వాతలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను మరో 15 శాతం పెంచేసి ప్రజల నడ్డి విరవబోతున్నారు. తాజాగా 15 శాతం పెంపుతో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల్ని పట్టణ స్థానిక సంస్థలు సిద్ధం చేస్తున్నాయి.

రాష్ట్రంలో దశాబ్దాలుగా అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలులో ఉంది. ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించాలన్న నిబంధన ఉంది. కానీ, ప్రజలపై భారం వేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిబంధనను ప్రభుత్వాలు అంత నిక్కచ్చిగా అమలు చేయలేదు. చివరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు ఆస్తిపన్ను సవరించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఆర్థికలోటు వేధిస్తున్నా ఆస్తిపన్ను పెంపు జోలికి వెళ్లలేదు.

లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు - BJP MP Candidates List

జగన్‌ అధికారంలోకి వచ్చాక నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా అప్పటి వరకున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానం తీసేసి, 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధిస్తున్నారు. ఫలితంగా పన్ను కొన్ని వందల రెట్లు పెరిగిపోయింది. ఒకేసారి అంత భారీగా పన్ను పెంచేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఏటా 15 శాతం చొప్పున పెంచుతూ వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కొత్త విధానంలో పెరిగిన పన్ను మొత్తంతో సమానమయ్యే వరకు ఏటా 15శాతం చొప్పున పన్ను పెరుగుతూనే ఉంటుంది.

ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆస్తుల విలువల్ని సవరిస్తుంది కాబట్టి పన్ను పెరుగుతూనే ఉంటుంది. అంటే ఏటా 15శాతం పెంపు కొనసాగుతూనే ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో 2020-21లో 1,157 కోట్ల రూపాయలుగా ఉన్న ఆస్తిపన్ను డిమాండ్‌ 2024-25 నాటికి 2వేల 109 కోట్ల రూపాయలకు చేరబోతోంది. అంటే నాలుగేళ్లలో 82.27శాతం పెరిగి ప్రజలపై 952 కోట్ల రూపాయలకుపైగా అదనపు భారం పడింది. పొరపాటున వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే 2025-26 నుంచి 2029-30 వరకు ఐదేళ్లలో పట్టణ ప్రజలు మరో 2వేల135 కోట్ల రూపాయల అదనపు భారం మోయాల్సి ఉంటుంది.

విశాఖపట్నం సీతమ్మధారలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 900 చదరపు అడుగుల ఫ్లాట్‌ కలిగిన ఒక సాధారణ వ్యక్తి 2020-21లో చెల్లించిన ఆస్తిపన్ను 3 వేల 834 రూపాయలు. జగన్‌ ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టాక 2021-22లో ఆ ఫ్లాట్‌కి పన్ను 4 వేల 410కి పెరిగింది. 2022-23లో అది 5 వేల 72 రూపాయలకు పెరిగింది. 2023-24లో 5 వేల 534 రూపాయలు, 2024-25లో ఆ ఫ్లాట్‌ ఓనర్‌ 6 వేల 364 చెల్లించాల్సి ఉంటుంది.

18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన - Janasena Candidates for 18 Seats

గుంటూరులోని పాత పట్టాభిపురానికి చెందిన పేద కుటుంబం పాత విధానంలో తమ ఇంటికి ఏడాదికి 780 రూపాయలు పన్ను చెల్లించేది. కొత్త విధానంతో 2021-22లో ఆస్తిపన్ను 990 రూపాయలకు పెరిగింది. 2022-23లో 1,032 రూపాయలు, 2023-24లో 1,186 రూపాయలు చెల్లించారు. 2024-24లో పన్ను భారం 1,363 రూపాయలకు చేరుతోంది. అంటే నాలుగేళ్లలో గుంటూరులోని ఆ కుటుంబంపై పన్నుభారం 74.86 శాతం పెరిగింది.

విజయవాడ గవర్నర్‌పేటలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనం యజమాని పాత విధానంలో ఏడాదికి 55 వేల 608 రూపాయలు పన్ను చెల్లించేవారు. కొత్త విధానం వచ్చాక 2021-22లో ఆస్తిపన్ను 63 వేల 950కి పెరిగింది. 2022-23లో 69 వేల 836, 2023-24లో 78 వేల 190 చెల్లించారు. 2024-25లో అది 89 వేల 918కి చేరుతోంది. ఆ భవన యజమానికి నాలుగేళ్లలో పన్నుభారం 61.70 శాతం పెరిగింది.

కొత్త పన్ను విధానంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం చెల్లిస్తున్న పన్ను 15 శాతానికి మించి పెరగదని అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చిలకపలుకులు పలికారు. కానీ ఏటా 15శాతం పెరుగుతుందని, అది సాధారణ ప్రజలు భరించలేని స్థాయికి చేరుతుందన్న విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.