ETV Bharat / state

15 వ రోజుకు చేరుకున్న ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్ర - మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Tanuku TDP Ex MLA Arimilli Radha Krishna: తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సకలజనుల చైతన్య యాత్ర 'రేపటి కోసం పాదయాత్ర' 15వ రోజు తణుకు పట్టణంలో ప్రారంభమైంది. నేడు ఆరిమిల్లి పాదయాత్ర, ఉండ్రాజవరం జంక్షన్, గణేష్ చౌక్, మునిసిపల్ కార్యాలయం, నరేంద్ర సెంటర్, వెంకటేశ్వర టాకీస్ సెంటర్ మీదుగా కొనసాగనుంది.

Tanuku TDP Ex MLA Arimilli Radha Krishna
Tanuku TDP Ex MLA Arimilli Radha Krishna
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 1:34 PM IST

15 వ రోజుకు చేరుకున్న ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్ర

Tanuku TDP Ex MLA Arimilli Radha Krishna: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సకలజనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర 15వ రోజు తణుకు పట్టణంలో ప్రారంభమైంది. ఆరిమిల్లి స్వగృహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా ముందుకు సాగింది. ఆరిమిల్లి రాధాకృష్ణకు తెలుగుదేశం కార్యకర్తలు, స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు.

టీడీపీలోకి చేరికలు: ఆరిమిల్లి ఇంటి నుంచి ప్రారంభమైన పాదయాత్ర, ఉండ్రాజవరం జంక్షన్, గణేష్ చౌక్, మునిసిపల్ కార్యాలయం, నరేంద్ర సెంటర్, వెంకటేశ్వర టాకీస్ సెంటర్ మీదుగా కొనసాగనుంది. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో ఆరిమిల్లి తనయుడు నిఖిల్ రత్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రెండవ వార్డ్​లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరినవారికి ఆరిమిల్లి టీడీపీ కండువా కప్పి ఆహ్వానం పలికారు.
వైఎస్సార్సీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు - పార్టీ వీడుతున్నట్లు నేతలు వెల్లడి


తణుకు పట్టణానికి పూర్వ వైభవం తెస్తా: ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli Radhakrishna) మాట్లాడుతూ, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ పరిపాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు పాలయ్యారని చెప్పారు. మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. తాను అధికారంలో ఉండగా తణుకు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించినట్లు తెలిపారు. త్వరలో రాబోయే తెలుగుదేశం - జనసేన ప్రభుత్వంలో తణుకు పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాధాకృష్ణ హామీ ఇచ్చారు. తాను తణుకు ఎమ్మెల్యేగా ఉండగా రోడ్లు, విద్యుత్, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా, ఏపీలో మాత్రం మహిళలకు స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు.
జగన్​ అరాచకాలపై లోకేశ్ ఎక్కుపెట్టిన అస్త్రమే శంఖారావం : మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

పార్టీ శ్రేనులు అప్రమత్తంగా ఉండాలి: జనసేన-టీడీపీ (TDP-Janasena) కార్యకర్తలు ఉమ్మడిగా కిలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి కుట్రలకు తెరలేపుతుందని అరిమిల్లి ఆరోపించారు. పార్టీ శ్రేనులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలకు తోడుగా ఉంటానని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతానని అలిమిల్లి పేర్కొన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అలిమిల్లి జోష్యం చెప్పారు.
వైసీపీ అరాచక పాలనను వివరిస్తూ ప్రజలను చైతన్య పరచాలనే పాదయాత్ర: అరిమిల్లి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.