Sweet Shops Crowded During Diwali Festival in Vijayawada : నెల మీద మెరిసే దీపపు మెరుపులు, నింగిని తాకే తారాజువ్వలంటే మనకు గుర్తొచ్చేది దీపావళి పండుగే. చీకటి రంగుల రంగేళి దీపావళికి తీపిని పంచే మిఠాయిలు బహుమతులు ఇవ్వడం అనవాయితీ. అందుకే విజయవాడలోని వ్యాపారస్థులు నోరురించే స్వీట్లు అందుబాటులో ఉంచారు. పండుగకి ఒక రోజు ముందు నుంచే నగరవాసులు మిఠాయిలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులతో దుకాణాలు రద్దీగా మారాయి.
భారతీయలు అత్యంత సంప్రాదాయంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. అటువంటి దీపావళి అంటే అందరికి గుర్తుకు వచ్చేది టపాసులు, స్వీట్లు. విజయవాడలోని టపాసుల కేంద్రాలతో పాటు స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మిఠాయిలు కొనుగోలు చేసి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఇచ్చేందుకు దుకాణాలకు క్యూ కడుతున్నారు. మిఠాయిలు, ఎండు ఫలాలు కొనుగోలు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా దుకాణదారులు రకరకాల గిఫ్ట్ ప్యాకెట్లు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. మిఠాయిలతో పాటు కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్లు, వంటి డ్రై ఫ్రూట్స్లను అందమైన గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో అమర్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. దీపావళికి ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్‌తో పాటు చాక్లెట్లతో తయారు చేసిన బార్బీ బొమ్మ కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి.
100కు పైగా వివిధ రకాల స్వీట్లు తయారు: ఒకప్పుడు ఇంట్లోనే కుటుంబమంతా తీపి వంటకాలు తయారు చేసుకునేవాళ్లు. ప్రస్తుతం క్షణం తీరిక లేని జీవితంలో అంత సమయం వారికి దొరకడం లేదు. అందుకే అందరూ మిఠాయి దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా దుకాణదారులు వివిధ రకాల స్వీట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాపారస్థులు తమ దుకాణాల్లో దాదాపు 100కు పైగా వివిధ రకాల స్వీట్లను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఉద్యోగులు తమ తోటి సహోద్యోగులకు, పై అధికారులకు స్వీట్లు ఇంచేందుకు స్వీట్లు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సారి అమ్మకాలు బాగా జరుగుతాయని వ్యాపారస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"మందు కొంటే గ్లాసు, గుడ్డు, నీళ్లు ఫ్రీ" - మద్యం ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన బార్
వెలుగుల పండగ వేళ కండీషన్స్ అప్లయ్ - ఆ సమయంలో సిగరెట్ కాల్చకండి!