ETV Bharat / state

తిహాడ్​ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత - 'మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారికి వడ్డీతో సహా చెల్లిస్తా' - MLC Kavitha Released Tihar Jail

Kavitha Released from Tihar Jail : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు తిహాడ్​ జైలు నుంచి విడుదలైయ్యారు. ఆమెకు కేటీఆర్​, హరీశ్​ రావు స్వాగతం పలికారు. బీఆర్​ఎస్​ శ్రేణులు బాణసంచా కాల్చి కవితకు స్వాగతం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని కవిత హెచ్చరికలు పంపారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమెకు దాదాపు 5 నెలల అనంతరం బెయిల్ దొరికింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్​ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Kavitha Granted release
BRS MLC Kavitha release (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 12:56 PM IST

Updated : Aug 27, 2024, 10:26 PM IST

BRS MLC Kavitha Released from Tihar Jail in Delhi : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం బెయిల్​ మంజూరు కాగా, రాత్రి 09.15 నిమిషాల తర్వాత ఆమె తిహాడ్​ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక భావోద్వేగానికి ఆమె గురయ్యారు. ఆమెకు సాదరంగా కేటీఆర్​, హరీశ్​ రావు, బీఆర్​ఎస్​ శ్రేణులు స్వాగతం పలికారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినాదం చేశారు. కవితను హత్తుకొని కేటీఆర్​, కవిత భర్త, కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు. తిహాడ్​ జైలు వద్ద బీఆర్​ఎస్​ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. వారిని చూసి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

'పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయం. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. కష్ట సమయంలో మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు. నేను కేసీఆర్‌ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండి దాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే నన్ను జైలుకు పంపారు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం. మేము పోరాడుతాం నిర్దోషిగా నిరూపించుకుంటా. ప్రజా క్షేత్రంలో మరింత నిబద్ధతతో పనిచేస్తాం. అని ఎమ్మెల్యే కవిత చెప్పారు. అనంతరం జైలు నుంచి వసంత విహార్​లోని బీఆర్​ఎస్​ కార్యాలయానికి వెళ్లిన కవిత, అక్కడే రాత్రికి బస చేయనున్నారు.

అసలేం జరిగింది : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్​పై విచారించిన జస్టిస్ బీఆర్​ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య​ ధర్మాసనం, ఈడీ, సీబీఐ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది.

మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో బెయిల్​తో పాటు కొన్ని షరతులు విధించిన ధర్మాసనం, ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. పాస్‌పోర్టును కింది కోర్టులో డిపాజిట్‌ చేయాలని సూచించింది.

అంతకుముందు కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్‌ రోహత్గి, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీశ్‌ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకూ వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు.

డేటా ఫార్మాట్​ చేయడం అసాధారణం : అనంతరం ఈడీ తరఫున వాదనలు వినిపించిన ఏఎస్‌జీ, ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారని, ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని కోర్టుకు తెలిపారు. ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఫోన్‌లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించగా, మెసేజ్‌లను కాదు, పూర్తిగా డేటాను ఫార్మాట్‌ చేశారని, సెల్‌ఫోన్‌ డేటాను పూర్తిగా ఫార్మాట్‌ చేయడం అసాధారణమని వివరించారు.

ఇరువైపుల సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం, కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ అధికారులు కవితను మార్చి 15న అరెస్ట్​ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె జైలులోనే ఉన్నారు. అనంతరం రాత్రి 9.15 నిమిషాలకు తిహాడ్​ జైలు నుంచి కవిత బయటకు వచ్చారు.

ఫోన్‌ మారిస్తే నేరం చేసినట్లా? - కవిత పాత్ర ఉందని చెప్పేందుకు ఆధారాలేంటి? : ఈడీ, సీబీఐలపై సుప్రీం అసహనం - Supreme Expressed Displeasure on ED

కొంత ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలిచింది - కవితకు బెయిల్​పై బీఆర్​ఎస్​ నేతల హర్షం - BRS Reaction on MLC Kavitha Bail

Last Updated : Aug 27, 2024, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.