Summer Effect In Konaseema District People Problems : కోనసీమ జిల్లా ముమ్మిడివరం వేసవి ఎండలకు అగ్నిగోళంలా మండుతోంది. రెండు రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సుమారు 45 నుంచి 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే సాగుతున్నాయి. ఉక్కపోత తట్టుకోలేక ప్రజలందరూ బయటికి రాకపోవడంతో వ్యాపారస్తులు దుకాణాలను మూసేస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం చిన్నారులు ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు.
అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్ 5లో ఒకటి - Weather Report in 2024
మండుతున్న ఎండలతో రోడ్లు నిర్మానుషంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గతవారం ఆకాశం మేఘావృతమై తేలికపాటి చిరుజల్లులతో వేసవి వాతావరణాన్ని చల్లబరిచినా, రెండు రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఋతుపవనాలు రెండు మూడు రోజుల్లో కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నా ఉక్కపోత మాత్రం ఎక్కువగానే ఉందంటున్నారు ప్రజలు.
Climate in Andhra Pradesh : ఎండ కారణంగా నిత్యం కళకళలాడితూ పచ్చగా ఉండే చెట్లు కూడా ఆకులన్ని రాలిపోయి మోడుబారుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం కొరకు కొందరు తాటి ముంజలను కొనుగోలు చేసుకుంటున్నారు. మద్యం బాబులు బీరు సీసాల కోసం షాపుల వద్దకు క్యూ కడుతున్నారు. చిన్నారుల అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతున్నారు.
Sudden Weather Changes : కొద్ది కాలంగా భారీ వానలు రాష్ట్రాన్ని కుదుపేశాయి. మండుటెండలకు హీటెక్కిన జనాలకు మంచి ఉపశమనాన్ని అందిచాయి. వారం రోజులపాటు రోజూ చిరుజల్లులతో వాతావరణాన్ని చల్లబరిచి వెళ్లేవి. తీరం దాటిన ద్రోణి ప్రభావం లేకుండా తీవ్రమైన ఎండలు ప్రజల్ని మండిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లడం కూడా తగ్గించారు. సగానికి సగం రోడ్డు ఖాళీగా ఉన్నాయి. భానుడి వేడిని తట్టుకోలేక పనులు మానుకుని సేద తీరుతున్నారు జనాలు. పిల్లలకు ఎండాకాలం సెలవులు కావడంతో వారంతా స్విమ్మింగ్ పూల్ల చుట్టూ చేరి సేద తీరుతున్నారు. అకస్మాత్తుగా కలిగే ఈ వాతావరణ మార్పులతో జనాలు కాస్త గందరగోళానికి గురవుతున్నామన్నారు.
ఆ మండలాల్లో వడగాడ్పు- ప్రజలు బయటకు రావొద్దు: ఐఎండీ హెచ్చరిక - high temperature