Father's Day Special Stories 2024 : ఆడపిల్లలకు వాళ్ల నాన్నతో ఉండే అనుబంధమే వేరు. పుట్టినప్పటి నుంచి మా ఇంట సిరి పుట్టింది అని మురిసి, ఏం చేస్తే కందిపోతారోన్నంత గారాబంగా పెంచి ఉన్నత స్థాయిలో నిలబడే వరకు వెన్నంటి నడుస్తాడు. జీవితాంతం మనతో ఉండకపోయినా ఎలా బతకాలి అన్న భరోసా ఇస్తాడు. ఆడపిల్ల పుట్టాక నాన్నలకు వారి కూతురే యువరాణి. వారి ప్రేమకు వారే సాటి. ఫాదర్స్ డే సందర్భంగా తమ వెన్నంటి ఉండి గెలుపు మార్గంలో నడిపించిన నాన్నల గురించి కూతుళ్ల మాటల్లో
నేను సివిల్స్ వైపు రావడానికి కారణం నాన్నే. పేరు ప్రకాష్‌రావు, కానిస్టేబుల్. ఆయనెప్పుడు నువ్వు ఏం చేసినా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనేవారు. చిన్నప్పట్నుంచీ అనాథాశ్రమాలకు తీసుకెళ్లడం, ఆయన చూసిన సంఘటనలు నాతో చెప్పేవారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన ఆఫీసర్లు, వారి సమాజసేవ గురించి పేపర్లో వచ్చే కథనాల గురించి చదవమనేవారు. ఆ మాటలు నన్ను సేవ చేయాలనే దిశగా నడిపించాయి.
అది నన్ను సివిల్స్ వైపు నడిపేలా చేసింది : మాది బోనకల్ మండలంలోని గోవిందాపురం. నేను ఏడోతరగతిలో ఉన్నాననుకుంటా ఓసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కలెక్టర్‌కు గౌరవవందన చేశారు. అది నన్ను ఆకర్షించిది. ఆరోజే అనుకున్న కలెక్టర్ కావాలని. అలా సివిల్స్ వైపు అడుగులు వేశా. సివిల్స్‌లో నాలుగుసార్లు విఫలమయ్యా. ఐదోసారి ప్రయత్నిస్తుంటే ప్రోత్సహించారు. ర్యాంకు వచ్చినప్పుడు ఇది నీ మొదటిమెట్టే ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని నా బాధ్యత గుర్తు చేశారు. నాకు వచ్చిన ర్యాంకుకి ఐఆర్ఎస్ వస్తుంది కానీ ఐఏఎస్ రావట్లేదు. మళ్లీ రాస్తానని చెప్పాను. ఇది కూడా సమాజానికి ఉపయోగపడే వేదికే కదా అని నాన్న అన్నారు. అయినా నాకు నచ్చిందే చేయమని చెప్పారు.
Father's Day Special : ఉప్పొంగిన నాన్న గుండె - ట్రైనీ ఐఏఎస్ కుమార్తెకు ఐపీఎస్ తండ్రి సెల్యూట్
నేను పట్టకముందుకే ఆట నా జీవితంలో భాగమైంది : నాన్న రాంరెడ్డి హాకీ ప్లేయర్. పలు పోటీల్లోనూ పాల్గొన్నారట. కానీ కొనసాగించలేకపోయారు. అందుకే తన పిల్లలను ఆటల్లో రాణించాలని అనుకున్నారు. అలా నేను ఈ భూమి మీదకు రాకముందుకే ఆట నా జీవితంలోకి వచ్చింది. తెలుగువాళ్లకు క్రికెట్ అంటే ఎంత క్రేజో తెలుసుగా. నాన్నకు కూడా ఇష్టమే. అందుకే నన్ను అటువైపు నడిపించారు. నా రెండో ఏటి నుంచే సాధన ప్రారంభించాను. మొదట్లో నాన్నే నా కోచ్. నాకు ఏడేళ్లు వచ్చాక నిపుణుల శిక్షణ అవసరమని అమ్మమ్మ, తాతయ్యలతోపాటు నన్ను హైదరాబాద్ పంపించారు. వీకెండ్స్‌లో అమ్మ వాళ్లు వచ్చేవారు. సంవత్సరంపాటు తాతయ్యే నన్ను తీసుకురావడం, తీసుకెళ్లడం చేసేవారు.
అన్ని వదిలేసి నా కోసం వచ్చారు : నాకు ఆక్సిడెండ్ కావడంతో నాన్న హైదరాబాద్‌కు మకాం మార్చారు. నాన్న ఐటీసీలో ఫిట్నెస్ కన్సల్టెంట్. జిమ్ నిర్వహించేవారు. వాటన్నింటినీ నాకోసం వదిలేసి ప్రతిక్షణం నాతోనే ఉండేవారు. ఉదయం శిక్షణ మొదలుకొని సాయంత్రం ఇంటికి వచ్చే వరకు సమయమంతా నాకే కేటాయించేవారు. ఇన్ని కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే ఆ పదకొండు మంది జట్టులో నేను ఉండాలనేదే ఆయన ఆశ. అండర్-19 వరల్డ్‌కప్ గెలిచాక కప్పు చూపించడానికి వెంటనే నాన్నకి వీడియో కాల్ చేశా. అది చూసి ఆయన ఎంత ఆనందించారో. సీనియర్ జట్టులో స్థానం సాధించాలి. నాన్న కల నెరవేర్చాలన్నది నా లక్ష్యం.
ఫాదర్స్ డే రోజు.. మీ తండ్రికి ఇవ్వాల్సిన '5' స్పెషల్ 'ఆర్థిక' బహుమతులు ఇవే!
Fathers Day 2023 : 'ఆ మాట నేను కాదనలేదు.. ఇంకా పాటిస్తున్నాను'