ETV Bharat / state

శ్రీవారి భక్తులు త్వరపడండి - జులై సేవా టికెట్లు విడుదల - ఎప్పుడంటే - srivari ticket issue - SRIVARI TICKET ISSUE

Srivari Arjita Seva Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం జులైకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. సేవా టికెట్లను ఆన్​లైన్​లో విడతల వారిగా విడుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

tirumala_tickets
tirumala_tickets
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 3:14 PM IST

Srivari Arjita Seva Tickets in Tirupati District : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులైకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల లక్కీ డిప్​నకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్​ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. లక్కీ డిప్​లో టికెట్లు పొందిన వారు చెల్లింపులు చేసి ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.

శ్రీవారి సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ - ఎప్పుడంటే?

శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమలలో ఆ సేవలన్నీ రద్దు! - TTD Vasanthotsavam

Tirumala Tirupati Devastanam : ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్​ సేవా టికెట్లును టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు వర్చువల్​ సేవా టికెట్లతో పాటు స్వామి వారి దర్శన స్లాట్​లను కూడా విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగ ప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు టోకెన్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

తిరుమల టైం స్లాట్​ టోకెన్ల జారీలో ప్రైవేట్ వాహన డ్రైవర్ల మోసాలు- భక్తులకు తీవ్ర ఇక్కట్లు! - Tirumala Time Slot Tokens Issue

Tirumala Ticket Issue Date : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 77,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,553 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు అని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.