ETV Bharat / state

డైలీ ఒక చెంచా 'స్పైరులినా' పొడి తీసుకోండి- సకల రోగాలకు సంజీవనిగా పనిచేస్తుంది! - Spirulina Health Benefits

Spirulina Health Benefits : ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు.. ఎన్ని ఎక్కువ పోషకాలు తీసుకున్నామన్నది ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే రోజువారీ డైట్​లో ప్రతిఒక్కరూ స్పైరులినాను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇది అనేక రోగాలకు దివ్యౌధంలా పనిచేస్తుందంటున్నారు. అసలేంటి.. స్పైరులినా? దీన్ని ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Health Benefits Of Spirulina
Health Benefits Of Spirulina (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 5:57 PM IST

Health Benefits Of Spirulina : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే చాలా మంది నేటి రోజుల్లో డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. కానీ, వాటన్నింటిని భర్తీ చేసే "స్పైరులినా పొడిని" రోజూ ఒక టీస్పూన్ తీసుకున్నారంటే చాలు. మీ అంత ఆరోగ్యంగా ఎవరు ఉండరని సూచిస్తున్నారు నిపుణులు! ఇంతకీ, స్పైరులినా పొడిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? దాన్ని ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్పైరులినా అనేది నాచు జాతికి చెందిన ఒక నీటి మొక్క. ముదురాకుపచ్చటి రంగులో ఉండే స్పైరులినా పొడిగా, బిళ్లలుగా, పాస్తాలాగా, పిల్లర్స్​లా.. వివిధ రూపాల్లో లభ్యమవుతుంది. ఫైకోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ స్పైరులినాకు ముదురాకుపచ్చ రంగును ఇస్తుంది. దీనిలో విటమిన్లు, కెరోటినాయిడ్స్‌, ఫైటో న్యూట్రియెంట్లు, కాపర్, ఐరన్, మెగ్నిషియం, క్రోమియంతో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీన్ని 'పోషకాల గని'గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా డైలీ ఒక టీ స్పూన్ స్పైరులినా పొడి తీసుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు.

మధుమేహులకు బెస్ట్ మెడిసిన్ : స్పైరులినా మధుమేహులకు దివ్యౌషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(National Library of Medicine రిపోర్టు) లెవల్స్​ని తగ్గించడంలో, HbA1c స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయని చెబుతున్నారు. 2021లో 'జర్నల్​ ఆఫ్ డయాబెటిస్ ఎండ్ మెటబాలిక్ డిజార్డర్స్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. స్పైరులినా పొడిని రోజూ కొద్దిగా తీసుకోవడం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్​ను కంట్రోల్​లో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్​లోని Guilan University of Medical Sciencesకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ Makan Pourmasoumi పాల్గొన్నారు.

గుండె ఆరోగ్యానికి మేలు : స్పైరులినాలోని ప్రొటీన్, ఇతర పోషకాలు బాడీలోని చెడు కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఇందులోని ప్రొటీన్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా జీవక్రియను మెరుగుపరచడానికి స్పైరులినా చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.

రక్తపోటును తగ్గిస్తుంది : స్పైరులినా రక్తపోటును కంట్రోల్​లో ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి హైబీపీతో బాధపడేవారు రోజూ ఒక టీస్పూన్ స్పైరులినా పొడి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.

మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : స్పైరులినాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులోని మినరల్స్ బాడీలోని హెవీ మెటల్స్(భార లోహాలను) బయటకు పంపించడంలో చాలా బాగా దోహదపడతాయి. ఈ మెటల్స్ రోగ నిరోధక కణాలను దెబ్బతీస్తాయి. అదే.. స్పైరులినా పొడి తీసుకుంటే ఆ సమస్య తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ పవర్​ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ : క్యాన్సర్​కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్​ను అడ్డుకోవడంలో స్పైరులినాలోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. అలాగే స్పైరులినాలో ప్రోబయోటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.

ఇవేకాకుండా.. మీరు స్పైరులినాను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్​ఫ్లమెటరీ గుణాలు అలర్జీలను రాకుండా అడ్డుకుంటాయి. అదేవిధంగా అధిక బరువుతో ఇబ్బందిపడే వారికి స్పైరులినా చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే.. దీనిలోని పోషకాలు బరువు తగ్గించడంలో సహాయపడుతాయని చెబుతున్నారు.

దీన్ని ఎలా తీసుకోవచ్చంటే ?

పోషకాల స్టోర్ హౌస్​గా చెప్పుకునే స్పైరులినా పొడిని... మీరు తాగే సూపుల్లో, స్మూతీల్లో ఒక టీస్పూన్ చేర్చుకోవచ్చు. లేదంటే.. చపాతీపిండి కలుపుతున్నప్పుడు అందులో కొద్దిగా ఈ పొడిని కలుపుకోవచ్చు. రుచిలో తేడా రాదు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

అలర్ట్‌ - రెగ్యులర్​గా జుట్టుకు రంగు వేస్తున్నారా ? ఈ సమస్యలు ఎటాక్​ చేయడం గ్యారెంటీ! - Side Effects of Hair Colouring

'ఒక్క మనిషి 8 మందికి జీవితాన్ని ఇవ్వొచ్చు - ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలి' - organ donation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.