ETV Bharat / state

ఈసారి ముందే నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడంటే ! - SOUTHWEST MONSOON 2024 - SOUTHWEST MONSOON 2024

Advance of Southwest Monsoon 2024 : నైరుతి రుతుపవనాలు అంచనాలకంటే ముందే కేరళ తీరం వైపు దూసుకొస్తున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి.

monsoon_arrives_over_bay_of_bengal
monsoon_arrives_over_bay_of_bengal (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 4:33 PM IST

ఈసారి ముందే నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడంటే ! (ETV Bharat)

Advance of Southwest Monsoon 2024 : అంచనాల కంటే ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే కేరళ తీరం వైపు దూసుకొస్తున్నాయి. ఈ నెల 31 నాటికి భారత ప్రధాన భూభాగాన్ని కేరళ వద్ద నైరుతి తాకుకుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా, అంతకంటే ముందే అవి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తదుపరి వారం రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకే అవకాశాలున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఈసారి వేగంగా విస్తరిస్తున్నాయి. భారత వాతావరణ విభాగం అంచనాల కంటే ముందుగానే రుతుపవనాల విస్తరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇవి అండమాన్‌ సహా హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాలు, శ్రీలంకలోని కామోరిన్‌ ప్రాంతాలను చుట్టేశాయని IMD స్పష్టం చేసింది. ఈ నెల 26 నాటికి ఆయా ప్రాంతాలను చేరాల్సి ఉన్నా, ముందుగానే ఇవి ఆయా ప్రాంతాల్లో విస్తరించినట్లు వెల్లడించింది. గత ఏడాది జూన్ 4 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. వాస్తవానికి అవి జూన్ 8న కేరళ తీరంలో వర్షాలు కురిపించాయి. గడచిన 25 ఏళ్లలో 2015లో మాత్రమే రుతపవనాలు అంచనాలు తప్పాయని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాల ఉత్తర కొన మాల్దీవులకు సమీపంలో ఉందని ఐఎండీ తెలిపింది.

Southwest monsoon arrival on May 31, says IMD : ప్రత్యేకించి వాయువ్య భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పాటుదక్షిణాది రాష్ట్రాల్లో ముందస్తు రుతుపవన జల్లులు నైరుతి రుతుపవనాల రాకకు ప్రధాన సంకేతమని ఐఎండీ స్పష్టం చేస్తోంది. మే 31 తేదీనాటికల్లా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకితే ఆ తదుపరి వారంలోగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాన్ని కూడా రుతుపవనాలు తాకే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరోవైపు హరియాణా, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది.

అకాల వర్షం - తడిచిన మొక్కజొన్న, ధాన్యం - నష్టపోయామంటున్న అన్నదాతలు - Crop Got Wet to Rains in AP

చల్లబడిన వాతావరణం - రాష్ట్రంలో మరో మూడు రోజులుపాటు వర్షాలు - AP Weather Report

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.