Sons Quarrel Over Mother Funeral: తల్లి బతికుండగా ఆమె దగ్గర డబ్బులను మొత్తం ఆ ముగ్గురు కుమారులు తీసుకున్నారు. తీరా అనారోగ్యంతో మృతి చెందిన ఆమె అంత్యక్రియలకు ముఖం చాటేశారు. నువ్వే ఎక్కువ తీసుకున్నావు కాబట్టి అంత్యక్రియల బాధ్యత నీదే అంటూ వాగ్వాదానికి దిగారు. తల్లి అంత్యక్రియలకు సైతం ముందుకురాని కుమారులను చూసి బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కుమారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఎంతగానో కలచి వేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందెపల్లి మండలంలోని ఓబులదేవరపల్లిలో గంగమ్మ అనే వృద్ధురాలికి భర్త లక్ష్మయ్య, ముగ్గురు కుమారులు గంగాధర్, అంజినప్ప, నరసింహులు ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.
కోర్టు బయటే రైతు ఆత్మహత్య - సోదరులతో ఆస్తి తగాదాలే కారణమా ?
మరణించిన తల్లి అంత్యక్రియలు చేసేందుకు ముగ్గురు కుమారులలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీనిపై పోలీసులు చివరికి పోలీసులు ఈ విషయంలో కలగజేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. గతంలో గంగమ్మ బతికున్నప్పుడు ఆమె దగ్గర ఉన్న డబ్బులను కుమారులు తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
తీరా ఇక ఇప్పుడు ఆమె మరణించిన తరువాత అంత్యక్రియల కోసం ముగ్గురి మధ్య వాగ్వాదం మొదలైంది. నువ్వే ఎక్కువ డబ్బులు తీసుకున్నావు కాబట్టి నువ్వే అంత్యక్రియలు చేయాలంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ గొడవకు దిగారు. ఇలా తల్లి అంత్యక్రియల బాధ్యత నీదంటే నీదంటూ ముగ్గురు అన్నదమ్ములు వాదించుకున్నారు.
ఈ విషయంలో కుమారుల తండ్రి సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. తన దగ్గర ఇంకేమీ డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిని అంతటినీ చూస్తూ ఉన్నారు. ఇది గమనించి తీవ్ర కలత చెందిన స్థానికులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశంతో ఎట్టకేలకు వృద్ధురాలు గంగమ్మ అంత్యక్రియలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
టైరు మీదపడి రెండేళ్ల బాలుడు మృతి.. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదం
పిల్లలు ఎక్కడున్నా తల్లిదండ్రులు చనిపోతే తమ ధర్మంగా వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తారని, కానీ ముగ్గురు కుమారులు ఉన్నా అంత్యక్రియలు చేసేందుకు కొట్టుకోవడం దారుణం స్థానికులంటున్నారు. ఇలాంటి ఖర్మ ఎవరికీ రాకూడదని అంటున్నారు.