ETV Bharat / state

మామ ఇంటికి వచ్చి ఐదు బైక్​లను తగలబెట్టిన అల్లుడు - కారణం తెలిస్తే షాక్​ అవుతారు - Burnt Vehicles Anger With his Uncle - BURNT VEHICLES ANGER WITH HIS UNCLE

Son-in-law Burnt the Vehicles in Anger With his Uncle: పిల్లనిచ్చిన మామ ఇంటికి వచ్చిన అల్లుడు ఐదు ద్విచక్ర వాహనాలు దగ్దం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఈడేపల్లిలో చోటుచేసుకుంది. అతను ద్విచక్ర వాహనాలు దగ్ధం చేయడానికి కారణం తెలిస్తే షాక్​కు గురవుతారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Son-in-law Burnt the Vehicles in Anger With his Uncle
Son-in-law Burnt the Vehicles in Anger With his Uncle (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 5:05 PM IST

Son-in-law Burnt the Vehicles in Anger With his Uncle : పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామ ఇంటికి వచ్చిన అల్లుడు చేసిన ఘనకార్యం తెలిస్తే మీరు షాక్​ అవుతారు. భార్యని కాపురానికి పంపండం లేదనే కోపంతో మామ ఇంటి వద్ద ఉన్న ఐదు ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం ఈడేపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గంటికోట శ్యామ్ ప్రసాద్ కుమార్తె భర్త వేధింపులు తట్టుకోలేక గత కొన్ని రోజులుగా పుట్టింటిలోనే ఉంటోంది.

భార్య తిట్టిందని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భర్త - WIFE AND HUSBAND ISSUE

కృష్ణా జిల్లా పెడన గ్రామానికి చెందిన దాసరి శబరినాధ్ తన భార్యను మామయ్య​ కావాలనే కాపురానికి పంపించడం లేదని కోపంతో ఆదివారం తెల్లవారుజామున మామ ఇంటికి వెళ్లాడు. భార్యను పంపించమని మామయ్యని అడగగా దానికి ఆయన ఒప్పుకోలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన అల్లుడు అక్కడ ఉన్న మూడు ద్విచక్ర వాహనాలపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. సమీపంలోని బంధువుల ఇంటి వద్ద ఉన్న మరో రెండు బైక్​లను కూడా దగ్ధం చేశాడు.

ఈడేపల్లిలో నివాసం ఉంటున్న శ్యామ్​ప్రసాద్​ స్థానిక స్టేషన్​కు వచ్చి తన అల్లుడు శబరీనాథ్​కు, కుమార్తెకు మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలిపాడు. తన ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలపై శబరీనాథ్​ పెట్రోల్​ పోసి నిప్పింటించాడని శ్యామ్​ప్రసాద్​ ఫిర్యాదు చేశాడు. నిప్పు పెట్టడంతో ఇంటి ముందు ఉన్న భాగం కాలిపోయిందని, బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న మరో రెండు బైక్​లను నిప్పు పెట్టాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. - సత్యనారాయణ, చిలకలపూడి సీఐ

బాధితుడు శ్యామ్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు కారణంగా భార్యభర్తలు ఇద్దరు తరచూ గొడవలు పడుతున్నారని పోలీసులు తెలిపారు. అందువల్లే ఆమె పుట్టింటికి వచ్చేసిందని పోలీసులు వివరించారు. ఆమె పుట్టింటికి వచ్చేందుకు ఇరువురి మధ్య మనస్పర్థలే కారణంగా పోలీసులు తేల్చి చెప్పారు.

అత్తతో వివాహేతర సంబంధం- మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Young Man Killed the Uncle

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.