Son Brutally Murders Parents : బాపట్ల మండలం అప్పికట్లలో దారుణం చోటుచేసుకుంది. కన్న కుమారుడే ఉన్మాదిగా మారి తల్లిదండ్రులను హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. మృతులు విశ్రాంత ఉపాధ్యాయుడు విజయ భాస్కరరావు, వెంకట సాయికుమారిగా వెల్లడించారు.
నిందితుడు కిరణ్ చీరాలలో తపాలా శాఖలో పని చేస్తున్నాడు. ఆస్తుల పంపకాల విషయంలో తల్లిదండ్రులతో వివాదం ఏర్పడి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కిరణ్ స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి తలుపులు, కిటికీలు పగులగొట్టాడు. దీంతో నిందితుడిని స్థానికులు పట్టుకొని బంధించి పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు.
ఆస్తుల పంపకాల విషయంలో తల్లిదండ్రులతో ఏర్పడిన వివాదంతో మానసిక పరిస్థితి సరిగా లేని కిరణ్ నాలుగు రోజులుగా అప్పికట్లలోనే ఉంటూ తల్లిదండ్రులతో గొడవలకు దిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను తలపై రోకలి బండతో విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు.
కువైట్ నుంచి వచ్చి చంపేశాడు - వీడియోతో వెలుగులోకి - ఆ తర్వాత ఏమైందంటే?