Small Earthquake in Nyalkal of Sangareddy District : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో(Earthquake) ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం వేళ భారీ శబ్దంతో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
గతంలోనూ ముంగితో పాటు ముంగి తండా, రుక్మాపూర్ శివారులో భూమి కనిపించిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు గుర్తు చేసుకున్నారు. న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో భూ ప్రకంపనాలపై స్థానిక తహసీల్దార్లతో మాట్లాడినట్లు జహీరాబాద్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి తెలిపారు. భూకంప తీవ్రత స్వల్ప స్థాయిలో ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆర్డీవో తెలిపారు.
శిథిలావస్థలో ఆందోల్ చారిత్రక కట్టడాలు- పునరుద్ధరించాలని స్థానికుల విజ్ఞప్తి
ప్రభుత్వ భూములపై అక్రమార్కుల డేగ కన్ను - గుట్టుచప్పుడు లేకుండా ఇసుక రవాణా