ETV Bharat / state

రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక - ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు - SLBC meeting Chaired by Chandrababu - SLBC MEETING CHAIRED BY CHANDRABABU

SLBC meeting Chaired by CM Chandrababu: నగదు బదిలీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు బ్యాంకర్ల సాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మొదటిసారి నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలతోపాటు బ్యాంకింగ్ రంగాన్నీ ఛిన్నాభిన్నంచేసిందని సమావేశంలో మంత్రులు పేర్కొన్నారు.

SLBC meeting Chaired by CM Chandrababu
SLBC meeting Chaired by CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 3:28 PM IST

Updated : Jul 9, 2024, 9:24 PM IST

SLBC meeting Chaired by CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ (State Level Banker's Committee) సమావేశం ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. తొలుత 4వ సారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్​ఎల్​బీసీ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డీబీటీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమల నిర్వహణకు బ్యాంకర్ల సాయం అవసరమని చంద్రబాబు తెలిపారు. సబ్సిడీపై ఇచ్చే రుణాలు, వివిధ పథకాల కింద లబ్దిదారులకు చేసే సాయం విషయంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని బ్యాంకర్లు సీఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేశారని మంత్రులు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రొత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో ఉచిత ఇసుక విధానం వచ్చేసింది- జీవో జారీ చేసిన ప్రభుత్వం - Free Sand Policy Guidelines

కీలక నిర్ణయాలు:

• 2024-25 సంవత్సరానికి రుణప్రణాళిక విడుదల చేసిన ఎస్‌ఎల్‌బీసీ

• ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల.

• రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక.

• వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్లు రుణాలు లక్ష్యం. వ్యవసాయ రంగానికి గతం కంటే 14 శాతం అధిక రుణాలు.

• డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.32 వేల 600 కోట్లతో రుణ ప్రాణాళిక.

• 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3.23 లక్షల కోట్లు పెట్టుకోగా, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.75 లక్షల కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యం. గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల లక్ష్యం.

• వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2.31 లక్షల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 90 శాతం అనగా రూ.2.08 లక్షల కోట్ల రుణాలు మంజూరు.

• ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే ఎంఎస్ఎంఈ రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87 వేల కోట్లు లక్ష్యం. అంటే 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని ప్రణాళిక.

• అలాగే గృహ నిర్మాణానికి రూ.11 వేల 500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక.

• సాంప్రదాయేత ఇంథన సెక్టార్​కు రూ. 8 వేల కోట్లు రుణ ప్రాణాళిక సిద్ధం.

• అయిదు ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
1.వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడంపై సబ్‌కమిటీ.
2. పి-4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడంపై సబ్‌కమిటీ.
3.డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంపై సబ్‌ కమిటీ.
4. స్కిల్ డవలప్​మెంట్​కు చర్యలు తీసుకోవడంపై సబ్‌కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
5.సంపద సృష్టించే, జిఎస్ డిపి పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు.

వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై పూర్తి వివరాలివ్వండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం - White Paper on YSRCP Land Grabs

Last Updated : Jul 9, 2024, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.