ETV Bharat / state

శ్రీకాళహస్తిలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు: రావణబ్రహ్మ వాహనంపై సోమస్కందమూర్తి - Nandhyal Sivarathri celebrations

Sivarathri celebrations at Sri Kalahasti: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి, నంద్యాల, శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి, ఉత్సవాలు వైభవంగా నిర్వహించటంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేయటంతో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Sivarathri_Celebrations_at_Sri_Kalahasti

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 2:19 PM IST

శ్రీకాళహస్తిలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు: రావణబ్రహ్మ వాహనంపై సోమస్కందమూర్తి దర్శనం

Sivarathri celebrations at Sri Kalahasti: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీకాళహస్తిలోని సోమస్కంద మూర్తి (Soma Skandha Murty) లంకేశ్వరుని పది శిరస్సులపై ఆశీనులై రాజసాన్ని ప్రదర్శిస్తూ భక్త కోటికి దర్శనం ఇచ్చారు. గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని స్వామి రావణ వాహనాన్ని అధిరోహిస్తే, అమ్మవారు మయూర వాహనంపై కొలువుదీరారు. శివ పరివారమైన వినాయకస్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరులతో క్షేత్రంలోని చతుర్మాడ వీధులు పులకించిపోయాయి. భక్తుల శివనామస్మరణలు, శంఖానాదాలు, వేదపండితుల మంత్రోచ్చారణలతో ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.

శివ నామస్మరణతో మార్మోగిన శారదాపీఠం... ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

కన్నుల పండువగా స్వామివారి బ్రహ్మోత్సవం: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవతామూర్తుల ముందు ధ్వజ పటాలం, నంది, భక్తుల కోలాటం, భజనలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో కైలాస నాథుని ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు మాడ వీధులకు చేరుకుని శివనామ స్మరణతో స్వామి అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు (Special arrangements) చేశారు.
Sivarathri Celebrations: రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు... ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన భూకైలాస్ సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది తీరాన శివపార్వతులతో పాటు, మంచు పర్వతంతో కూడిన భూకైలాస్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకునే భక్తులు ముందుగా ఈ దేవతామూర్తుల చిత్రాలను దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నడంతో శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్లకు ఆలయం తరఫున ఉచితంగా బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు వీక్షిస్తున్నారు.

Sivarathri celebrations at Nandhyal: నంద్యాల జిల్లా మహానంది, శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు మహానందీశ్వర స్వామిని మయురా వాహనంపై ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఊరేగింపు సాగింది. బ్రహ్మోత్సవంలో భాగంగా లింగోద్భవం, లోక కల్యాణం, రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు తదితర ఉత్సవాలను నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు (Temple administrators) తెలిపారు.

"దక్షిణ భారతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై స్వామి వార్ల ఊరేగింపు ఉంటుంది. 8వ తేదీన మహారుద్రాభిషేకం,స్వామి వారి కల్యాణం జరుగుతుంది."

- రవి శంకర అవధాని, వేద పండితులు

నెల్లూరు జిల్లాలో నీలకంఠేశ్వరుని మహోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.