ETV Bharat / state

33 చోట్ల హింసాత్మక ఘటనలు - ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ నివేదిక - డీజీపీకి అందజేత - SIT report to DGP

SIT Report to DGP on Election Violence in AP: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను సిట్ అధికారులు పరిశీలించారు.

SIT report to DGP
SIT report to DGP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 3:46 PM IST

Updated : May 20, 2024, 7:01 PM IST

SIT Report to DGP on Election Violence in AP: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై రెండ్రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు.

కాగా ఆంధ్రప్రదేశ్​లో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం (EC) ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT​) ఏర్పాటైంది. పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను సైతం జోడించాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు.

సిట్​ దర్యాప్తులో కీలక విషయాలు- 'స్వామిభక్తి చాటుకున్న పోలీసులు' - SIT investigation

తాజాగా ఎన్నికల్లో హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ (Special Investigation Team) అందించింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదిక ఇచ్చారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. ఈకేసుల్లో 1370 మంది నిందితులుగా తేల్చిన పోలీసులు కేవలం 124 మందినే అరెస్ట్ చేశారని సిట్ నివేదికలో వెల్లడించింది.

అయితే కేవలం 124 మంది నిందితులనే ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో తెలిపింది. 94 మందికి 41 ఏ నోటీసులు అందించారని తెలిపింది. మిగిలిన నిందితులను కూడా త్వరిగతిన అరెస్ట్ చేయాలని పోలీసులకు సిట్ అధికారులు సూచించారు. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో 10 ,మాచర్లలో 8, గురజాలలో 4 కేసులు చొప్పున మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. మొత్తం 581 మంది నిందితులు పాల్గొంటే 274 మందిని గుర్తించారు. వీరిలో కేవలం 19 మందిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో తేల్చింది. 91 మంది నిందితులకు 41 ఏ నోటీసులిచ్చారు. తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 చొప్పున మొత్తం నాలుగు కేసులు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 61 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 47 మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది.

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఏడు ఘటనల్లో 728 మంది నిందితులు పాల్గొంటే 396 మందిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. కేవలం 91 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 634 మంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని సిట్ నివేదికలో స్పష్టం చేసింది. సిట్ నివేదికను పరిశీలిస్తే పోలీసులు కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్ విషయాల్లో ఎంత నిర్లక్ష్యం వహించారో తెలుస్తుంది.

ఎన్నికల హింసపై విచారణ చేపట్టిన సిట్‌ బృందాలు - ఎవరి పాత్రేంటో తేల్చే పనిలో నిమగ్నమైన అధికారులు - SIT Enquiry Violence In Elections

హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను సైతం సిట్ సభ్యులు విచారించారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం, ఎఫ్ఐఆర్‌లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేశారన్న సిట్ బృందం పేర్కొంది.

స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సిట్‌ బృందం, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు సీఈవో, సీఈసీకి సిట్ నివేదికను ప్రభుత్వం పంపింది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది.

అల్లర్లపై సిట్‌ ఆరా - వీడియోలు, ఎఫ్ఐఆర్​లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు - SIT Officials Started Investigation

Last Updated : May 20, 2024, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.