Singireddy Niranjan Reddy Fires on Revanth Reddy : లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన సీఎం తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దావోస్‌లో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని ధ్వజమెత్తారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తేవాలి కానీ, వెకిలి మాటలు మాట్లాడొద్దని అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్
రేవంత్‌రెడ్డి పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను రేవంత్ గురువు చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే తెలుగుదేశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రికి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హితవు పలికారు.
"సీఎం రేవంత్‌రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి దావోస్‌లో రాష్ట్రం పరువు తీశారు. విదేశాలకు వెళ్తే పెట్టుబడులు తేవాలి కానీ వెకిలి మాటలు వద్దు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి చేయాలి. కేసీఆర్‌ను రేవంత్ గురువు చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోయారు." - సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి
BRS Leaders Fires on Revanth Reddy : అధికారం ఉందని రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో తొక్కిపెడతా అనడం సబబు కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) వ్యాఖ్యానించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. అధికారం ఉన్నా లేకపోయినా తాము ఒకేలా ఉన్నామని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని అన్నారు. కానీ తెలంగాణ పరువు బజారుకీడిస్తే ఎలా అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని దానం నాగేందర్ సవాల్ విసిరారు.
'ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నాం - లేదంటే చీల్చి చెండాడేవాళ్లం'
అసలేం జరిగిదంటే : లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితిని నిషాన్ లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీ గుర్తు లేకుండా వంద మీటర్ల లోతులో పాతిపెడతానని అన్నారు. ఆ పార్టీ నేతలకు అధికారం పోయినా, అహంకారం మాత్రం తగ్గలేదని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
దావోస్‌కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది : గండ్ర