Simhadri Appanna Kalyanam Grandly Held in Simhachalam : లోక కల్యాణ కారకుడైన సింహాద్రినాథుడి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పందిరి రాటతో శ్రీకారం చుట్టారు. ఏటా స్వామివారి కల్యాణోత్సవాలకు ఉగాది రోజున పెళ్లిరాట వేయడం ఆచారంగా వస్తోంది. ఇందులో భాగంగా అర్చకులు సంప్రదాయబద్ధంగా వేడుక నిర్వహించారు. తొలుత ఆలయ ఆస్థాన మండపంలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. క్రోధి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఆలయ అలంకారి పురోహితుడు కరి సీతారామాచార్యులు స్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం చేశారు.
సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ తులసి దళార్చన - నేత్రపర్వంగా సాగిన కళ్యాణోత్సవం
ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా తొలి పందిరి రాట ఉడుపును సంప్రదాయబద్దంగా జరిపించారు. అనంతరం ఆలయ రాజగోపురం, కల్యాణ వేడుక జరిగే నృసింహ మండపం ఆవరణలో పెళ్లిరాటలు వేశారు. ఈవో సింగల శ్రీనివాసమూర్తి దంపతులు, మాజీ ట్రస్టీలు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేశ్రాజ్, ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐ.వి. రమణాచార్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 19న సింహగిరిపై స్వామివారి వార్షిక కల్యాణోత్సవం, రథోత్సవం వైభవోపేతంగా జరగనున్నాయి.
వైభవంగా నరసింహుడి బ్రహ్మోత్సవాలు - మహాయజ్ఞానికి ఏర్పాట్లు - Narasimha Maha yagnam Simhadri
Ugadi Celebrations in Simhachalam : అప్పన్న ఆలయంలో అపూర్వ ఘట్టం సింహాద్రినాథుడిని తాకిన సూర్యకిరణాలు : సింహాచలం, సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తన కిరణ స్పర్శతో దేవదేవుడిని అభిషేకించిన అద్భుత సన్నివేశం మంగళవారం సాయంత్రం భక్తులను ఆధ్యాతిక పరవశం కలిగించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాస్తమయం సమయంలో సూర్య కిరణాలు అప్పన్న స్వామిని తాకాయి. ఏటా ఉగాది రోజున జరిగే ఈ అపురూప దృశ్యాన్ని కనులారా దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భానుడు పడమర కనుమల్లోకి వాలుతుండగా ఆలయ రాజగోపురం నుంచి అరుణ కిరణాలు అప్పన్న స్వామిని చేరుకున్నాయి. భక్తులు గోవింద నామస్మరణతో ఈ దృశ్యాన్ని తిలకించి పరవశులయ్యారు. కొన్నేళ్లుగా వాతావరణం అనుకూలించక కిరణ స్పర్శను దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగలేదు. ఈసారి ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో అద్భుత దృశ్యం సాకారమైంది. ఈవో సింగల శ్రీనివాసమూర్తి, వైదికుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం, తరలి వచ్చిన భక్తులు
సింహాద్రి అప్పన్న సేవలో భారత క్రికెటర్లు- మ్యాచ్కు ముందు పూజలు