ETV Bharat / state

నాణెంపై ‘భారత్‌’కు బదులుగా ‘మారత్‌’ - 30 ఏళ్ల కృషితో 3 గిన్నిస్‌ రికార్డులు - COINS COLLECTING MAN

30 ఏళ్లుగా నాణేల సేకరణను అభిరుచిగా మలచుకున్న శంకరరావు కొండపనేని - ద్విలోహ, ముద్రణా లోపాలున్న కాయిన్ల సేకరణతో ప్రపంచ ఖ్యాతి

Man Achieved Three Guinness Book Records Due To Coins Collecting
Man Achieved Three Guinness Book Records Due To Coins Collecting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2024, 12:20 PM IST

Man Achieved Three Guinness Book Records Due To Coins Collecting : 'చూడు.. ఒకవైపే చూడు..రెండో వైపు చూడకు' ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్‌ కదా. అయితే ఒక వ్యక్తి మాత్రం కనిపించిన ప్రతి నాణేన్నీ రెండో వైపే కాదు అన్ని వైపులా చూడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే నాణేల సేకరణను అభిరుచిగా మలచుకున్నాడు. మూడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులను సాధించాడు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ముద్రించే బై-మెటాలిక్‌ (ద్విలోహ), ముద్రణా లోపాల నాణేల సేకరించి ఖ్యాతి గడించారు. ఆయనే శంకరరావు కొండపనేని. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామంలో జన్మించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థిరపడ్డారు. ఇంతకి ఈ ఆలోచన ఆయనకు ఎప్పుడు, ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

అమరావతి ప్రభావంతో..

‘‘నేను పుట్టి పెరిగింది ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఉన్న అమరావతి పరిసర ప్రాంతం. దీంతో ఎప్పుడూ చరిత్ర తెలుసుకోవాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలోనే అరుదైన నాణేలు, పెయింటింగ్స్‌ అంటే చిన్న వయస్సు నుంచి ఎంతో ఇష్టం ఉండేది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ఓ నాణెంపై ‘భారత్‌’కు బదులుగా ‘మారత్‌’ అని హిందీలో తప్పుగా ముద్రించటాన్ని గుర్తించా. అప్పట్నుంచి కనిపించే ప్రతి నాణేన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టా. అలాంటి తప్పులున్న మరికొన్ని నాణేలను సేకరిస్తూ వచ్చా. పురాతన నాణేలపై ముద్రించిన చిహ్నాలు, లిపిని గమనిస్తూ ఉండేవాడిని. అలాగే వాటి చరిత్రను తెలుసుకునే వాన్ని. ఈ క్రమంలో వాటిపై ఆసక్తి కాస్తా మమకారంగా మారింది. ఈ సమాచారాన్ని భవిష్యత్తు తరాలకు తెలపాలనే లక్ష్యంతో ‘సేవ్‌ కాయిన్స్‌-సేవ్‌ హెరిటేజ్‌’ నినాదాన్ని మొదలు పెట్టా. ఇలా మూడు దశాబ్దాలుగా వేల సంఖ్యలో నాణేలను సేకరిస్తూ వస్తున్నా.

ఎనిమిది నెలల్లో మూడు రికార్డులు..

1,578 ముద్రణా లోపాల నాణేలను సేకరించా. దీనికి మొదటిసారి 2023 ఆగస్టు17న గిన్నిస్‌ రికార్డు వచ్చింది. అలాగే అరుదైన సందర్భాల్లో, సంస్థలు, వ్యక్తులు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం ప్రభుత్వాలు బై-మెటాలిక్‌ నాణేలను ముద్రిస్తుంటాయి. ఉదాహరణకు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం రూ.10, రూ.5, రూ.2 ద్విలోహ నాణేలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రత్యేక సందర్భాల్లో వివిధ దేశాలు, రాజ్యాలు విడుదల చేసిన 3,526 రకాల నాణేలను సేకరించా. దీనికిగాను ఈ ఏడాది జనవరి 14వ తేదీన రెండోసారి గిన్నిస్‌ రికార్డు వచ్చింది. అదేవిధంగా ముద్రణా లోపాలున్న 7,369 నాణేల సేకరించినందుకుగానూ మూడోసారి ఈ సంవత్సరం మార్చి 5న గిన్నిస్‌ రికార్డు దక్కింది.

భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో..

కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న. 30 ఏళ్లుగా సేకరించిన నాణేలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి, వాటి చారిత్రక విశేషాలనూ తెలుపుతూ ఓ ఆల్బమ్‌ రూపొందించా. అందులో మౌర్య, గుప్త, కుషాణుల సామ్రాజ్యాల కాలంలో మారకంలో ఉన్నవి ఉన్నాయి. అలాగే బ్రిటిష్‌, పోర్చుగీసు హయాం నుంచి ఇప్పటివరకు భారతదేశాన్ని పాలించిన రాజులు, నాయకులకు సంబంధించినవీ ఉన్నాయి" అని శంకరరావు కొండపనేని వివరించారు. గత చరిత్రను కాపాడటం, దాన్ని అంచనా వేయడంలో ఈ నాణేల పాత్ర కీలకం అనేది తన దృఢ విశ్వాసమని, అందుకే వాటిని భవిష్యత్ తరాలకు అందించాలనేదే తన లక్ష్యమని శంకరరావు కొండపనేని పేర్కొన్నారు.

'ఎందుకలా దూరం పెడుతున్నారు - కాస్త నన్నూ వాడుకోండి ప్లీజ్' - పది పాట్లు - RBI Clarified on 10 Rupee Coin

హాబీతో ప్రత్యేకత చాటుకున్న యువకుడు - నాణేల సేకరణతో అంతర్జాతీయ రికార్డులు - RAVITEJA COINS COLLECTIN

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.