ETV Bharat / state

ఇంటర్​ బోర్డు ప్రక్షాళన చేయాలి - ఫీజులు నియంత్రించాలి : విద్యార్థి సంఘాల ఆందోళన - SFI and AISF Intermediate Board Office - SFI AND AISF INTERMEDIATE BOARD OFFICE

Student Leaders Protest at Intermediate Board Office : కార్పొరేట్​ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయడం సహా ప్రభుత్వ ఇంటర్​ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లోని ఇంటర్మీడియట్​ బోర్డు కార్యాలయం ఎదుట ఎస్​ఎఫ్​ఐ,ఏఐఎస్​ఎఫ్​ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి.

SFI and AISF Protest at Intermediate Board Office

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 2:40 PM IST

ఇంటర్​ బోర్డు ప్రక్షాళన - కార్పొరేట్​ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలి : విద్యార్థి సంఘాల ఆందోళన

SFI and AISF Protest at Intermediate Board Office : కార్పొరేట్​ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయడం సహా ప్రభుత్వ ఇంటర్​ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లోని ఇంటర్మీడియట్​ బోర్డు కార్యాలయం ఎదుట ఎస్​ఎఫ్​ఐ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్​ బోర్డు ముందు బైఠాయించినా అధికారులు స్పందించకపోవటంతో పలువురు ఎస్​ఎఫ్​ఐ శ్రేణులు గేటు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

ఆందోళనల నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మారినా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. అనుమతులు లేని కళాశాలలను వెంటనే మూసివేయాలని డిమాండ్​ చేశారు. రీ-వెరిఫికేషన్​ పేర్లతో కొన్ని కార్పొరేట్​ కళాశాలలు రూ.లక్షల ఫీజులను వసూలు చేస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్​ఐ శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

"రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్​ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలి. ప్రభుత్వ ఇంటర్​ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. అనుమతిలేని కళాశాలలను వెంటనే మూసివేయాలి. రీ వెరిఫికేషన్​ పేర్లుతో కొన్ని కార్పొరేట్​ కళాశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి." - విద్యార్థి నాయకులు, ఎస్​ఎఫ్​ఐ

ఇంటర్​ బోర్డును ప్రక్షాళన చేయాలి : మరోవైపు ఇంటర్​ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్​ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హైదరాబాద్​లోని ఇంటర్మీడియట్​ బోర్డును ముట్టడించింది. నాంపల్లిలోని ఇంటర్​ బోర్డు కార్యాలయం ముందు ఎఐఎస్​ఎఫ్​ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్​ చేసి బేగంబజార్​ పోలీసు స్టేషనక్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్​ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఏఐఎస్​ఎఫ్​ సమాఖ్య నాయకులు కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి మార్పులు జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తింపు లేని జూనియర్​ కళాశాలలను రద్దు చేయాలని కోరారు. అనధికార కార్పొరేట్​ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్​ బోర్డు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇంటర్‌ మూల్యాంకనంలో ఇష్టారాజ్యం - జవాబులు సరిగ్గా ఉన్నా మార్కులు రాక విద్యార్థుల ఆవేదన - Errors inter evaluations telangana

ఫీజుల నిర్ధారణ లేదు.. హాస్టళ్లకు అనుమతుల్లేవ్.. ఇష్టారాజ్యంగా 'కార్పొరేట్'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.