Sand & Micro Artists Tribute to Ramoji Rao : కలం యోధుడు రామోజీరావుకు కళాకారులు తమదైన శైలిలో నివాళులర్పించారు. సైకత శిల్పకారులు, సూక్ష్మ కళాకారులు రామోజీరావు చిత్రాన్ని గీసి ఆయన సేవలను కొనియాడారు. మీడియా, కళారంగాలకు ఆయన చేసిన అనితర కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Artistic Tribute to Ramoji Rao : శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేష్ సుద్దముక్కపై రామోజీరావు చిత్రాన్ని రూపొందించారు. మాలాంటి కళాకారులు తీర్చిదిద్ది సూక్ష్మ చిత్రాలను ఈ-టీవీ నెట్‌వర్క్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో శ్రీజానకి రామమందిరంలో సంకీర్తనలతో రామోజీరావుకు సంతాపం తెలిపారు. కలంతో తెలుగువారి విశిష్టతను ప్రపంచ నలుమూలలకు విస్తరించిన మహోన్నత వ్యక్తి అంటూ కీర్తించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు అంజి కలం యోధునికి తన కుంచెతో చిత్రం గీసి నివాళులర్పించారు.
తెలుగు సారధి వెలుగు వారధి- రామోజీరావు జీవితమొక తెరిచిన పుస్తకం! - Media Mogul Ramoji Rao Passed Away
Artists Pays Tribute to Ramoji Rao : మీడియా రంగానికి, సమాజానికి రామోజీరావు చేసిన సేవకు గుర్తుగా కృష్ణానదిలో గుంటూరు జిల్లాకు చెందిన సైకత శిల్పకారుడు బాలాజీ సైకత శిల్పాన్ని చెక్కారు. ఈ-టీవీ, ఈనాడు తనకు రెండు కళ్లు అని అనేక సందర్భాలలో రామోజీరావు చెప్పిన మాటలకు సజీవ రూపం కల్పించారు.
రామోజీరావు మృతికి నివాళి అర్పిస్తూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎందరో నియంతలను తన కలంతో మట్టి కరిపించిన మేరునగ ధీరుడు, అవిశ్రాంత పోరాట యోధుడు రామోజీరావుకు శ్రద్ధాంజలి అంటూ కీర్తించారు.
Ramoji Film City founder Ramoji Rao passes away : మీడియా మొఘల్ రామోజీరావు గారికి సంతాప సూచికంగా నెల్లూరులో సూక్ష్మ కళాకారుడు ఉమాశంకర్ మర్రి ఆకులపైన రామోజీరావు, ఈనాడు చిత్రాలను చిత్రీకరించి నివాళులు తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామానికి చెందిన మంచాల సనత్ కుమార్ రామోజీరావు సైకత శిల్పాన్ని రూపొందించి నివాళులర్పించారు.