RTC Introduced Pickup Van Facility for Passengers From Hyderabad to Vijayawada Routes : హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్-ఎల్బీనగర్ మధ్య ప్రాంతాల నుంచి విజయవాడ, నార్కట్‌పల్లి - అద్దంకి మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ శుక్రవారం పికప్ వ్యాన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈసీఐఎల్ కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలి హెచ్‌బీకాలనీ, మల్లాపూర్ బస్టాప్, హెచ్‌ఎంటీనగర్, నాచారం బస్టాప్, ఉప్పల్ మెట్రో స్టేషన్, నాగోలు - సుప్రజ హాస్పిటల్, ఎల్బీనగర్ ఎల్‌పీటీ మార్కెట్ వద్ద పికప్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ పేర్కొంది.
ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులను పికప్ వ్యాన్ల ద్వారా ఎల్బీనగర్ తరలించి అక్కడి నుంచి జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సుల్లో ఎక్కించనున్నారు. 12 బస్సు సర్వీసులకు మాత్రమే ఈ పికప్ వ్యాన్ సదుపాయం ఉందని సంస్థ అధికారులు తెలిపారు.
ముందస్తుగా ఈ సర్వీసులకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ పికప్ వ్యాన్‌లో ఎల్బీనగర్ చేరుకునేలోపే వేర్వేరు డిపోల నుంచి ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ, ఏసీ స్లీపర్, నాన్ ఏసీ, రాజధాని బస్సులు సిద్ధంగా ఉంటాయి. సందేహాలు ఉంటే 040-69440000, 040-23450033 ఫోన్ నంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
దొంగను పట్టించిన కండక్టర్ - వదిలేసిన పోలీసులు - కారణం తెలిస్తే షాక్
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు