ETV Bharat / state

బ్యాంకులో నకిలీ 'గోల్డ్​లోన్'- కోట్ల రూపాయల ఘరానా మోసం - AP Latest News

Rold Gold Loan Fraud in Bank of Maharashtra Bapatla Branch: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌. ఈ ఘరానా మోసం బాపట్ల జిల్లాలోని ఓ బ్యాంకులో వెలుగులోకి వచ్చింది.

Rold_Gold_Fraud_in_Bank_of_Maharashtra_Bapatla_Branch

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 11:43 AM IST

Updated : Mar 6, 2024, 2:14 PM IST

బ్యాంకులో నకిలీ 'గోల్డ్​లోన్'- కోట్ల రూపాయల ఘరానా మోసం

Rold Gold Loan Fraud in Bank of Maharashtra Bapatla Branch: బాపట్ల పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బాపట్ల శాఖలో ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్న వెల్లటూరి రాఘవేంద్ర రావు 21 మంది బినామీల పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక కోటి 77 లక్షల 62 వేల రూపాయలు రుణం తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. తాజాగా బ్యాంకులో ఆర్బీఐ(RBI) ప్రతినిధులు ఆడిటింగ్ చేయగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోట్లు స్వాహా చేసినట్లు బయటపడింది.

బ్యాంకు మేనేజర్ శ్రీ హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్డ్ అప్రైజర్ రాఘవేందర్ రావుతో పాటు 21 మంది ఖాతాదారులపై బాపట్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల గంజాయి అక్రమ రవాణా కేసులో అతన్ని బాపట్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Huge Gold Theft In Manappuram Gold Loan Company : మణప్పురం బ్రాంచ్​లో ఉద్యోగుల చేతివాటం.. రూ.కోట్ల విలువైన బంగారం మాయం

జిల్లా కేంద్రం బాపట్లలో ఏడాది క్రితం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు శాఖను ప్రారంభించారు. వెల్లటూరి రాఘవేంద్ర రావు అనే యువకుడు బ్యాంకులో గోల్డ్ అప్రైజర్​గా విధుల్లో చేరాడు. గోల్డ్ అప్రైజర్​గా బంగారం నాణ్యతను నిర్ధారించేది అతడే కావడంతో పక్కాగా ప్రణాళికతో ప్రకారం నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా ధ్రువీకరించి మోసానికి పాల్పడ్డాడు.

రాఘవేంద్ర ఇచ్చిన ధ్రువీకరణ ఆధారంగా బ్యాంక్ అధికారులు వెనకా ముందూ ఆలోచించకుండా కోట్లలో గోల్డ్ లోన్స్ మంజూరు చేశారు. డిసెంబర్ జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ లోపు రుణాలు స్వాహా తతంగం నడిచింది. 21 మంది ఖాతాల పేరు మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రాఘవేంద్ర పలు విడతల్లో బ్యాంకు నుంచి కోటి 77 లక్షల 62 వేల రూపాయలను అక్రమంగా తీసుకున్నాడు. బినామీలకు కొంత చెల్లించి కోట్లు రుణాలను రాఘవేంద్ర బృందం స్వాహా చేసింది. అప్రైజర్ ధ్రువీకరణ ఇవ్వడంతో మోసాన్ని తాము గుర్తించలేకపోయామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు తెలిపారు.

రాఘవేంద్ర ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల 13న నేర ప్రవృత్తి కలిగిన స్నేహితులు రాహుల్, తేజ, సోను, మరికొంతమందితో కలిసి పట్టణ శివారులో రాఘవేంద్ర మద్యం తాగి ఓ రెస్టారెంట్లో ఉండగా ప్రత్యర్థి వర్గంతో జరిగిన ఘర్షణలో వీరి వర్గానికి చెందిన గోరంట్ల వెంకట సుమంత్ హత్యకు గురయ్యాడు. అనంతరం కొద్ది రోజులు పరారీలో ఉన్నాడు. 20 కేజీల గంజాయి రవాణా చేస్తుండగా సీసీఎస్ పోలీసులు రాఘవేంద్ర, విజయసాయిని అరెస్టు చేసి గత నెల 13న రిమాండ్​కు పంపించారు. ప్రస్తుతం అతడు గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

బ్యాంకునే బురిడీ కొట్టించిన గోల్డ్ అప్రైజర్- నాణ్యతలేని బంగారంతో 3 కోట్ల స్కాం

Last Updated : Mar 6, 2024, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.