ETV Bharat / state

రాళ్లు కూలి, మట్టి కొట్టుకొచ్చి పంటలన్నీ నాశనం - ఆదుకోవాలని గిరిపుత్రుల వేడుకోలు - Rain Effect In Hill Area in Alluri

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Rain Effect In Hill Area in Alluri District : వర్షాల కారణంగా రాష్ట్రమంతా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. బాధితులంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ అల్లూరి జిల్లాలో జరిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం అందలేదని గిరిపుత్రులు వాపోతున్నారు. కనీసం తమ ప్రాంతాలకు ప్రజాప్రతినిధులు వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

rain_effect_in_hill_area_in_alluri_district
rain_effect_in_hill_area_in_alluri_district (ETV Bharat)

Rain Effect in Hill Area in Alluri District : వాయిగుండం ప్రభావంతో కురిసిన వానలకు అల్లూరి జిల్లా అతలాకుతలం అయ్యింది. వాయనాడ్​ విలయాన్ని తలపించేలా కొండ ప్రాంతాల్లో రాళ్లు కూలిపోయి, మట్టి కరిగి పొలాల్లో చేరి పంటలన్నీ తుడిచి పెట్టుకుపోయాయని గిరి పుత్రులు ఆందోళన చెందుతున్నారు. కొండ నాలుగైదు చోట్ల కుంగి అరవై అడుగుల వృక్షాలు కూడా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుని ఊళ్ల మీద పడ్డాయి.

బండరాళ్లు సైతం బంతుల్లా మారి ఐదు కిలోమీటర్ల మేర దొర్లుకుంటూ వెళ్లి వందల ఎకరాల మాగాణిని నామ రూపాలు లేకుండా చేశాయి. పచ్చగా కనిపించే పొలాలలో బండరాళ్లు వాగులుగా దర్శనమిస్తుంటే గిరి పుత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బ్రతికున్నాం అంతే, తిండి గింజలు పండించుకునే పంట మొత్తం ప్రకృతి విలయానికి అర్పించి పస్తులుండేలా చేసిందని ఆవేదన చెందుతున్నారు.

రెండు వారాలు అల్లూరి జిల్లాలో కురిసిన వర్షం ధారకొండ పంచాయతీ కమ్మరితోటలో బీభత్సం సృష్టించింది. వాయనాడ్‌ తరహాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదు. కానీ బండరాళ్లు గిరిజనుల పంటపొలాలను నామరూపాల్లేకుండా చేశాయి. పచ్చని పొలాలు వాగుని తలపిస్తున్నాయని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భవానీ ద్వీపానికి వరద దెబ్బ - కళావిహీనంగా మారిన పరిసరాలు - Bhavani Island Damaged in Floods

'వందగడపలు ఉన్న ప్రాంతం ఇది. సుమారు 50కుటుంబాలకు సంబందించిన పంట కొట్టుకుపోయింది. వరి ఎక్కువగా పండించేవాళ్లం. ఇప్పుడు ఎం చెయ్యాలో తోచడం లేదు. కొండ జారి సాగు చేసిన పంట అంతా వరద పాలైంది. మొత్తం ఏడు చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. మూడు మీటర్ల కాలువ ఇప్పుడు పెద్ద వాగును తలపిస్తుంది. చంద్రబాబు నాయుడు బాధితులందరినీ ఆదుకుంటామని తెలిపినట్టే మాకు సహాయం చెయ్యాలి. మంత్రులు పర్యటించి నష్టాన్ని అంచనా వెయ్యడానికి తగిన చర్యలు చేపట్టాలి. మాకు బతుకుదెరువు చూపించాలి.' -బాధితులు

రాత్రికి రాత్రి జరిగిన విలయానికి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. కొండ చరియల బీభత్సంతో సర్వం కోల్పోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కుమ్మరితోట గ్రామస్థులు కోరుతున్నారు.

బుడమేరు బురదలో వస్త్రాలు​ - కన్నీటి తడిలో విజయవాడ వ్యాపారులు - Heavy Losses to Textile Traders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.