ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో అధ్వానంగా అంతర్గత రోడ్లు - ప్రమాదకరంగా ప్రయాణాలు - అధ్వానంగా సంగారెడ్డి జిల్లా రోడ్లు

Roads Damage in Sangareddy District : సంగారెడ్డి జిల్లా అంతర్గత రహదారుల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులకు నరకం కనబడుతోంది. రాత్రిళ్లు గోతులు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐదేళ్ల నుంచి రోడ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు అంటున్నారు.

Roads Damage in Sangareddy District
Roads Damage in Sangareddy District
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 10:22 AM IST

సంగారెడ్డి జిల్లాలో అధ్వానంగా అంతర్గత రోడ్లు

Roads Damage in Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో మెుత్తం ఐదు నియోజకవర్గాలున్నాయి. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, ఆందోల్‌, నారాయణఖేడ్‌. ఇందులో నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ అభివృద్ధిపరంగా వెనుకబడిన నియోజకవర్గాలు. ఎప్పుడో వేసిన రోడ్లే తప్ప, కొత్తగా నిర్మించిది లేదు. గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ గోతులు ఏర్పడి, వాహనాల రాకపోకలకు నిత్యం అంతరాయం ఏర్పడుతోంది.

సంగారెడ్డి మండలంలోని ఉత్తరపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక బస్సు సౌకర్యాన్ని సైతం నిలిపేశారు. విద్యార్ధులు, ఉద్యోగులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆందోల్‌ మండలంలోని అంతర్గత రోడ్లు కూడా పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గం తీసుకున్నా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అదే నారాయణఖేడ్​లో అయితే పెద్ద పెద్ద కంకర రాళ్లు రోడ్లపై తేలాయి. అన్ని అంతర్గత రోడ్లలన్నీ అధ్వానంగా మారాయి. వాహనాలపై ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.' - స్థానికులు

Sangareddy People Suffering Roads Damage : పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్‌చెరు ప్రాంతంలో కూడా అంతర్గత రోడ్ల పరిస్థితి (Roads Damage) అధ్వానంగా తయారైంది. జహీరాబాద్‌ మండలంలోని రోడ్లపై పూర్తిగా రాళ్లు తేలాయి. ఈ రెండు పట్టణాలను కలుపుతూ వెళ్లే రోడ్లపై అధిక లోడ్లతో పెద్దపెద్ద లారీలు ప్రయాణిస్తుంటాయి. వీటి వల్ల భారీగా గుంతలు ఏర్పడ్డాయి. జిల్లాలోని అంతర్గత రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.

NIRMAL ROADS: అడుగడుగునా గుంతలు.. అత్యవసర సమయాల్లోనూ అవస్థలు

దీని వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని, పిల్లల స్కూల్​ బస్సు కూడా లేట్​గా వెళ్తుందని తెలిపారు. కొన్ని చోట్ల చిన్న చిన్న యాక్సిడెంట్​లు కూడా జరుగుతున్నాయని చెప్పారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతర్గత రోడ్లపై దృష్టి సారించి, ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

'రోజూ వందలాది వాహనాలు అధిక లోడ్​తో వెళ్లడం వల్ల రోడ్లలన్నీ గుంతలమయమై, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి. జిల్లా కేంద్ర నుంచి మండల కేంద్రం వెళ్లే రోడ్లు కూడా అనేక చోట్ల గుంతలు ఏర్పడి చాలా ఇబ్బంది అవుతుంది'. - స్థానికులు

అధ్వాన్నంగా ఇందూరు రోడ్ల దుస్థితి - ఇకనైనా మారదా పరిస్థితి

Roads Damage Hyderabad : అధ్వాన్నంగా రోడ్లు.. ప్రమాదకరంగా ప్రయాణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.