Road Problems for Tribals in Alluri District : అల్లూరి జిల్లా అభివృద్ధి కోసం విడుదలైన నిధులు వైఎస్సార్సీపీ పాలనలో దోపిడీ పాలయ్యాయి. దీంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. అనంతగిరి మండలం తలారిపాడు నుంచి తేనెపట్టు వరకు రహదారి నిర్మించాలని 77 లక్షల 62వేల రూపాయల నిధులు విడుదలయ్యాయి. 80శాతం నిధులు డ్రా చేసినప్పటికీ రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో డోలిమోత కష్టాలు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
YSRCP Scam In Road Formation In Tribal Area : 72 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు పనులు చేసినట్లు గుత్తేదారులు చూపిస్తున్నారని గిరిజనులు చెబుతున్నారు. వాస్తవంగా ఎక్కడ తట్ట మట్టి కూడా వేయలేదని వాపోయారు. మూడు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోలేదని అదివాసిలు అంటున్నారు. ఇప్పటికైన అధికారులు రహదారి నిర్మించి తమ కష్టాలను తొలగించాలని వేడుకుంటున్నారు.
గిరిశిఖర ప్రజలకు తప్పని డోలీ మోతలు - గర్భిణిని 5కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు - Pregnant Woman Carried For Doli
No Road Facility Dolly Problems to Tribals : మూడు నెలలుగా ఫిర్యాదు చేసిన ఇప్పటికి ఏ అధికారీ పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రోజా అనే మహిళ తన పుట్టింటికి వెళ్తుండగా గోతిలో పడిపోయి నడుము విరిగిందని, దీంతో డోలిమోతతో ఆవిడని మూడు కిలోమీటర్లు మోస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ రోడ్డు 2022 సంవత్సరంలో మెటీరియల్ బ్రాండ్ కింద 3 విభాగాలుగా మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో మూడో విభాగానికి చెందిన తేనెపట్టు నుంచి తలారిపాడుకు ఎటువంటి పనులు జరగలేదు, కల్వర్టులు కట్టలేదు, గ్రావెల్ వెయ్యలేదు. రాడ్ బ్రేకర్ ద్వారా రాయిని తొలగించలేదు.
ఓటు వేయాలన్నా డోలీ మోతలే - 'ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు' - Voters Problems