Ripen Mangoes Scam in Hyderabad : ఆహార భద్రతా అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని పలు పండ్ల దుకాణాల్లో దాడులు నిర్వహించారు. మామిడి కాయలను మగ్గించేందుకు నిషేధిత కెమికల్స్ వాడుతున్నట్లు తనిఖీల్లో తేలింది. అవే దుకాణాల నుంచి నగరంలోని పలు జ్యూస్ స్టాళ్లకు పండ్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వేసవి కాలంతో పాటు శుభకార్యాలు జరిగే సీజన్ కావడంతో కృత్రిమంగా మామిడి కాయలను మగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ క్రమంలోనే పోలీసులు దాడులు నిర్వహించి, గత అయిదు రోజుల్లో ఏడుగురు పండ్ల దుకాణాల యజమానులని అరెస్ట్ చేశారు.
కాల్షియం కార్బైడ్ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల దుకాణాల యజమానులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్‌కు సంబంధించి చిన్న సాషెట్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే దుకాణదారులకు దురాశను కలిగించింది.
"రాబోయో రెండు,మూడు నెలలు మామిడ పళ్ల సీజన్ ఉంటుంది. ఈ సీజన్ మొత్తం మేము పండ్ల దుకాణాలపై రైడ్ చేస్తాం. మామిడి పండ్లను మగ్గపెట్టడానికి నిషేధిత కెమికల్స్ వాడుతున్నారని రుజువు అయితే వాటన్నింటినీ సీజ్ చేస్తాం. ఇలాంటి వాటికి పాల్పడ్డవారికి నష్టం ఉంటుంది. అలాగే ఈ సీజన్లో మామిడి పళ్ల తినని వారికి ఎలాంటి సమస్య ఉండదు. ఇలాంటి మళ్లీ జరగకుండా ప్రజలు కూడా జాగ్రత్త పడాలని చెప్తున్నాము. మంచి పద్ధతిలో పండ్లను మాగపెట్టి అమ్మకాలు జరిపితే అందరికి మంచిది." - రష్మి పెరుమాళ్, డీసీపీ, టాస్క్‌ఫోర్స్
మామిడిని మగ్గబెట్టేందుకు.. తాత్కాలిక పద్ధతుల వైపే మొగ్గు
Vendors Using Chemicals To Ripen Mangoes : దాంట్లో భాగంగానే మంగల్‌హట్‌కు చెందిన రామేశ్వర్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్, అఘాపురకు చెందిన హుస్సేన్, ఎంఎం పహాడికి చెందిన సయ్యద్ జహూర్, చార్మినార్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మస్తాన్, భవాని నగర్‌కు చెందిన సయ్యద్ అస్లామ్, మొఘల్‌పురకు చెందిన సయ్యద్ షాదుల్లాను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. నిషేధిత కాల్షియం కార్బైడ్‌తో మగ్గిన పండ్లను తింటే భవిష్యత్‌లో కాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.
Mango Farmers Problems : వానలతో కొంత.. ధరలు లేక మరికొంత.. దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు
ఏడుగురు నిందితుల నుంచి మొత్తంగా రూ.12 లక్షల విలువ చేసే మామిడికాయలతో పాటు నిషేధిత పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కాల్షియం కార్బైడ్‌తో మగ్గించిన పండ్లను కడగకుండానే తింటే చర్మ, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుళ్లిపోయి, నలుపు రంగులోకి మారిన వాటిని తినకుండా ఉండాలంటున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం నిషేధిత పౌడర్ వాడి మగ్గబెడితే సెక్షన్ 59 కింద జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.