ETV Bharat / state

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగే అవకాశం లేదు: సిసోదియా - RP Sisodia on Madanapalle Incident

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 8:39 PM IST

RP Sisodia on Madanapalle Fire Accident: మదనపల్లె ఘటన కుట్రకోణంలో జరిగిందని, సబ్‌కలెక్టరేట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగే అవకాశం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా తేల్చిచెప్పారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చారని, అప్పటికే సబ్‌కలెక్టరేట్‌లో కిటికీలు, అద్దాలు పగిలిపోయాయన్నారు. రసాయనం వాడకుండా భారీగా మంటలు వచ్చే అవకాశం లేదన్నారు.

RP Sisodia on Madanapalle Fire Accident
RP Sisodia on Madanapalle Fire Accident (ETV Bharat)

RP Sisodia on Madanapalle Fire Accident: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా స్పష్టం చేశారు. మదనపల్లె ఘటన కుట్రకోణంలో జరిగిందని తెలిపారు. కచ్చితంగా ఫైళ్లను ఎవరో తగలబెట్టారనేది తమ అనుమానమని వెల్లడించారు. ఫైళ్ల దగ్ధం ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు.

ఓల్టేజ్ అంశాన్ని సాంకేతికంగా పరిశీలన చేశామన్నారు. విద్యుత్ వినియోగం కేవలం నెమ్మదిగా తగ్గిందని, ఒక్కసారిగా తగ్గలేదని వివరించారు. ఇందులో రసాయన చర్య లేకుండా ఈ అగ్నిప్రమాదం జరగడానికి ఆస్కారం లేదన్నారు. మోటార్ ఆయిల్ కార్యాలయంలోకి తెచ్చి ఉంచారని తెలిపారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడి ఇంట్లో సోదాలు చేశారని, ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని సీఎం ఆదేశించారన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశామని, భూ అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్నారు. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్యటించి వినతులు స్వీకరిస్తామని సిసోదియా తెలిపారు.

మదనపల్లె అగ్ని ప్రమాదం నిగ్గుతేల్చిన సిసోదియా!- ప్రభుత్వానికి కీలక నివేదిక - SISODIA REPORT

ఎమ్మార్వో నివేదికను, సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని సిసోదియా తెలిపారు. చుక్కల భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల ఎకరాలకుపైగా భూములు ఆక్రమణలకు గురయ్యాయని ప్రాథమికంగా గుర్తించినట్లు ఆర్పీ సిసోదియా అన్నారు. వాటి లెక్కలు తేల్చే పనిలో ఉన్నామన్నారు.

నిషిద్ధ జాబితా నుంచి తొలగాక ఆ భూముల క్రయవిక్రయాలు సులువవుతాయన్నారు. 25 వేల ఎకరాలకు రిజిష్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. జీపీఏ (General Power of Attorney) ఎన్ని ఎకరాలకు పూర్తయిందో లెక్కగడుతున్నామని పేర్కొన్నారు. మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై వాచ్‌మెన్‌ను విచారించామని, ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చారని సిసోదియా తెలిపారు.

అప్పటికే సబ్‌కలెక్టరేట్‌లో కిటికీలు, అద్దాలు పగిలిపోయాయని, రసాయనం వాడకుండా భారీగా మంటలు వచ్చే అవకాశం లేదన్నారు. కార్యాలయంలో కొన్ని తప్పుడు దస్త్రాలు ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. 14 వేల ఎకరాల చుక్కల భూములు ఒకేసారి ఫ్రీ హోల్డ్‌ అయ్యాయని అన్నారు. 14 వేల ఎకరాల చుక్కల భూములు ప్రైవేటు వ్యక్తులకే కట్టబెట్టారన్న సిసోదియా స్పష్టం చేశారు.

మదనపల్లె దస్త్రాల దహనం కేసు- ఇద్దరు ఆర్డీఓలపై సస్పెన్షన్‌ వేటు - Madanapalle Fire Accident Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.