Retired Engineer Designed Agricultural Robot in Ongole : ప్రస్తుత తరుణంలో కూలీ రేట్లు విపరీతంగా పెరిగిన సమయంలో సాగు బ్రతకాలంటే ఆధునిక యంత్రాలను వాడాల్సిందే. తక్కువ ధరలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశ్యంతో ఒంగోలుకు చెందిన విశ్రాంత మెకానికల్ ఇంజనీర్ జి. కోటేశ్వరరావు ఆధునిక సాంకేతికతతో మల్టీపర్పస్ రోబోను తయారు చేశారు. ఈ రోబో దున్నడం, విత్తనాలు వెదజల్లడం, కలుపుతీత, కోతపనులతోపాటు రాత్రి పూట పొలం కాపాలా కూడా కాస్తుందని తెలిపారు.
సాంకేతికత నానాటికీ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయంలోకీ ఆధునిక పోకడలు వచ్చి చేరుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు సరికొత్తగా డ్రోన్లు ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేయడంలో రైతులు అవలంభిస్తున్న విధానంలో వ్యయప్రయాసలు అధికం. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేవారు కూలీలకు అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. క్రిమిసంహారక మందుల పిచికారీ సమయంలో కొందరు అనారోగ్యం బారిన కూడా పడుతున్నారు. డ్రోన్ వినియోగంతో ఈ సమస్యలు ఇకపై దూరం కానున్నాయి.
సాఫ్టేవేర్ సహకారంతో ప్రోగ్రామింగ్ చేసి అవసరమైన పనికి సంకేతం ఇస్తే దానంతట అదే పూర్తి చేసేలా రూపకల్పన చేశారు. దీనిని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. కోటేశ్వరరావు, ఆయన భార్య సుజాతకు వ్యవసాయంపై మక్కువతో 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఒకే యంత్రం నాలుగు పనులు చేయడం ద్వారా సాగు ఖర్చులు నియంత్రించవచ్చని కోటేశ్వరరావు చెబుతున్నారు.
'ప్రస్తుతం వ్యవసాయం చేసేవాళ్లకు సాయం చేసేవాళ్లు తక్కువ. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఏదో విధంగా రైతులకు సహాయం అందించాలని మల్టీ పర్పస్ మిషన్ తయారు చేశాను. ఇది మూడు గంటలు పని చేస్తుంది. రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తుంది. దీన్ని అటానమస్ చెయ్యడాని ట్రయల్స్ జరుగుతున్నాయి. అది విజయవంతం అయితే రిమోట్ అవసరం పని చేస్తుంది.' -కోటేశ్వరరావు, విశ్రాంత మెకానికల్ ఇంజనీర్
రైతుల కష్టాలకు చెక్ పెట్టేలా 'రోబో ట్రాక్టర్'.. ఐదు రకాల పనులు అవలీలగా
50 నిమిషాల్లోనే 1,484 అగ్రో రోబోలు తయారీ.. చైనా రికార్డ్ బ్రేక్ చేసిన విద్యార్థులు