ETV Bharat / state

రాజీనామా చేసిన వాలంటీర్లకు తాయిలాలు - వైసీపీ బూత్‌ ఏజెంట్లుగా... - resigned volunteers services - RESIGNED VOLUNTEERS SERVICES

YSRCP leaders using resigned volunteers services: గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన వారిని పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా వైసీపీ తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భగంగానే వైసీపీకి అనుకులంగా వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

resigned volunteers services
resigned volunteers services
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 3:33 PM IST

YSRCP leaders using resigned volunteers services: గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి, వారిని పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా వైసీపీ తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారికి వైసీపీ కొత్త మ్యానిఫెస్టోతోపాటు బూత్‌ ఏజెంటుగా కూర్చోబెట్టాక ఏం చేయాలి? ఎలా చేయాలనే అంశాలపై వైసీపీ కార్యాలయంలో తర్ఫీదు ఇచ్చినట్టు తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను ప్రస్తుతం ఇంటింటికీ పంపి పింఛనుదారులు, లబ్ధిదారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. మళ్లీ వైసీపీ కే ఓటు వేయాలనీ, అప్పుడే జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని, పింఛన్లతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలను తామే ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని.. రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చెబుతున్నట్టు తెలుస్తోంది.

వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొందరు వైసీపీ నేతలను దీనికోసమే నియమించి మరీ., రాజీనామాలు చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. రాజీనామాలు చేసే వారికి రెండు మూడు నెలల జీతాలు ముందే ఇచ్చేసి, తిరిగి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని వైసీపీ నేతలు హామీలు ఇస్తున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో వారితో బలవంతంగా రాజీనామాలు సైతం చేయించినట్లు వార్తలు వినిపించాయి. విజయవాడ తూర్పులో కోడ్‌ అమలులో ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా, అధికార పార్టీ నేతలు పది రోజుల కిందట వాలంటీర్లతో రహస్య సమావేశం పెట్టారు. దేవినేని అవినాష్‌ కీలక అనుచరుడి ఆధ్వర్యంలో రాణిగారితోట ప్రాంతంలోని 17వ డివిజన్‌ బాపనయ్యనగర్‌లో ఉన్న ఓ పాఠశాలకు సమీపంలో ఈ రహస్య భేటీ ఏర్పాటు చేశారు. రాజీనామా చేసేవాళ్లకి రూ.10 వేలు ఇస్తామనీ, చేయని వారికి తమ ప్రభుత్వం మళ్లీ వస్తే.. ఇబ్బందులు తప్పవని బెదిరించి మరీ కొందరు వాలంటీర్లతో సంతకాలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అన్ని నియోజకవర్గాల్లోనూ.. రాజీనామాలు చేయించేందుకు ఒకే రకమైన పంథా అనుసరించడం, వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి పెట్టడం, చేయని వారిపై కక్ష సాధింపులు తప్పవనే హెచ్చరికలు ఎక్కువయ్యాయి. కేవలం ప్రచారంలో వారిని వాడుకునేందు కోసం ఇలా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని, ఇప్పటివరకూ అంతా అనుకున్నారు. కానీ, వారితో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైసీపీ నేతలు పెద్ద ప్లానే రచించినట్టు తెలుస్తోంది. వారిని ఎన్నికల రోజు పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లుగా కూర్చోబెట్టి, వారి ద్వారా ఆయా గ్రామాల్లో ఓటర్లను భారీగా ప్రభావితం చేయాలనేదే అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, వాలంటీర్లతో ఓ ప్రహసనంలా బలవంతంగా రాజీనామాలు చేయించేందుకు వైసీపీ నేత ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇంటింటికీ తిరిగి పట్టుపెంచుకున్న.. వాలంటీర్లతో ఎన్నికల రోజు ఓటర్లను బాగా ప్రభావితం చేయాలనేది వైసీపీ అసలు కుట్ర.

బాలినేని ఎన్నికల ప్రచారంలో వాలంటీర్​ - ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడి - Fight Between TDP And YSRCP

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సుమారు 22,400 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో రెండు జిల్లాల్లో కలిపి, ఇప్పటికే రెండు వేల మంది వరకూ రాజీనామాలు చేశారు. గుడివాడలో ఇప్పటివరకూ 70 మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వీరందరినీ ఎన్నికల్లో బూత్‌ ఏజెంట్లుగా వాడుకోవాలని, వైసీపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా నే వారికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే, ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగడానికి ఆస్కారమే ఉండదనీ.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లోనే కూర్చుని, ఓటర్లను ప్రభావితం చేయడం కంటే దారుణం ఇంకొకటి ఉండదని కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో రాజీనామా చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.2.50 లక్షలు చొప్పున ఇచ్చి వైసీపీ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ, టీడీపీ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు ఆరోపిస్తున్నారు.

ఎంపీ అక్రమాలపై వాలంటీర్​ పోరాటం - నందిగం సురేష్​పై పోటీ - Volunteer Contesting election

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.