ETV Bharat / state

రెరా కార్యదర్శి శివ బాలకృష్ణకు 8 రోజుల పోలీస్ కస్టడీ

Rera Balakrishna Case Update : అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన రెరా ఇన్​ఛార్జి, కార్యదర్శి శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయన్ను విచారించనున్నారు.

RERA Balakrishna Court Update
Rera Balakrishna Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 3:02 PM IST

Updated : Jan 30, 2024, 7:33 PM IST

Rera Balakrishna Case Update : అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ఇన్​ఛార్జి, కార్యదర్శి శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయిన్ను రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన్ను అధికారులు విచారించనున్నారు. ఇటీవల సోదాల్లో సుమారు 100 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు పలువురు బినామీలను కూడా గుర్తించారు.

దర్యాప్తులో బినామీలు సహా బ్యాంకు లాకర్లను తెరవనున్నారు. అయన అదేశాలతో పనిచేసిన కొందరు అధికారులను సైతం విచారించే అవకాశం ఉంది. మరోవైపు శివబాలకృష్ణ వల్ల తాము నష్టపోయామని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఏసీబీ కార్యాలయానికి వస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా శివబాలకృష్ణకు సంబంధిచిన మరికొన్ని ఆస్తులు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

HMDA Ex Director Shiva Balakrishna Case : ఈ నెల 24, 25 తేదీల్లో శివ బాలకృష్ణ ఇల్లు సహా బంధువులు, సన్నిహితులు ఇళ్లతో కలిపి మొత్తం 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా రెండు ఇన్‌ఫ్రా సంస్థలకు అవినీతి నిరోధక శాఖ బృందాలు వెళ్లగా ఒక సంస్థలో అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. కొత్తపేటలోని క్విఆరిజన్ స్పేస్ సంస్థలో అధికారులు సోదాలు చేశారు. కానీ బంజారాహిల్స్​లోని సాయి సందీప్ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్​లో సోదాలు చేసేందుకు కుదరకపోవడంతో వారిని కార్యాలయానికి పిలిచి విచారించాలని ఏసీబీ భావిస్తోంది.

ఇప్పటికే నోటీలు జారీ చేసినట్లు సమాచారం. మరో వైపు సోదాల్లో గుర్తించిన 15 బ్యాంకు ఖాతాలు లావాదేవీలపై అధికారులు అరా తీయనున్నారు. శివ బాలకృష్ణ సహ అతని సోదరుడు అతని భార్యా, కుమార్తె, కుమారుడు పేర్లపై ఈ బ్యాంకు ఖాతాలు గుర్తించారు. వీటిలో కొన్ని బ్యాంకు ఖాతాలకు లాకర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిని వారి సమక్షంలో తెరిచేందుకు సిద్ధమయ్యారు.

ACB On Rera Balakrishna : రెరా కార్యదర్శిగా ఉన్నప్పటికీ బాలకృష్ణ అక్రమ సంపాదన అంతా హెచ్ఎండీఏ కేంద్రంగానే సాగినట్లు తెలుస్తోంది. ఓవైపు హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా ఉంటూనే, మరోవైపు ఎంఏయూడీలో ఇన్​ఛార్జి డైరెక్టర్గానూ కొనసాగారు. ఈక్రమంలో హెచ్ఎండీఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలిచ్చేవారు, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.

ఈ విషయాలపై నిగ్గు తేల్చేందుకు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అనుమతులు జారీ చేసిన దస్త్రాలు పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ డైరెక్టర్​గా బదిలీ అయినా సరే పలు కీలక ఫైళ్లు ఇతని వద్దనే ఉంచుకున్నారని అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఇందులో భాగంగా బాలకృష్ణ ఎక్కువగా అనుమతులు జారీ చేసిన బిల్డర్లను ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారించాలని భావిస్తున్నారు.

బాలకృష్ణకు జ్యూడిషియల్‌ రిమాండ్ - ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు

హెచ్ఎండీఏ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు

Last Updated : Jan 30, 2024, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.