ETV Bharat / state

రేషన్​కార్డుదారులకు అలర్ట్​ - ఆ తేదీలోపు ఈ పని చేయకపోతే సరుకులు కట్​! - Ration Card e KYC Last Date

Latest News on Ration Cards: తెలంగాణ ప్రజలకు అలర్ట్​. రేషన్​ కార్డు కలిగిన వారు ఈ పని చేయకపోతే నష్టం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Ration Card e-KYC Last Date
Ration Card e-KYC Last Date (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 10:39 AM IST

Ration Card e-KYC Last Date: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ దారిద్రరేఖను కేంద్రంగా చేసుకునే ప్రవేశపెడుతుంటాయి. అందుకే.. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కావాలని కోరుకుంటారు. అయితే గత కొంత కాలంగా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అర్హులకే రేషన్ సరుకులు అందే విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రేషన్‌ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేశారు. ఈ కేవైసీ చేయించిన వారికి మాత్రమే రేషన్​ సరుకులు అందనున్నాయి. చేయించని వారి పేరు రేషన్​ కార్డులో నుంచి తొలగించనున్నారు. అయితే ఇప్పటికే ఈ-కేవైసీకి గడువును పొడగిస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా.. మరో అవకాశం కల్పించారు. ఆలోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని లేదంటే రేషన్ సరుకులు పొందలేరని చెప్పారు.

అప్పటి నుంచే: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డుదారులు కేవైసీ నమోదు చేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గడిచిన 7 నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే.. ఇప్పటికీ 100 శాతం కేవైసీ పూర్తి కాలేదట. ఇంకా గడువు ఉంది కదా అని కొందరు లైట్ తీసుకుంటుండగా.. ఆధార్ అప్డేట్ సమస్యలతో చాలా మంది కేవైసీ పూర్తి చేయలేకపోతున్నారు.

కేంద్రాల వద్ద రద్దీ.. రేషన్ కేంద్రాల్లో చాలా మంది కేవైసీ పూర్తికావట్లేదు. దీనికి ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు చెబుతున్నారు. దీంతో.. జనాలు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే.. ఆధార్ సెంటర్స్ తగినన్ని లేకపోవడంతో.. ఉన్న కొద్దిపాటి కేంద్రాల ముందు జనాలు బారులు తీరుతున్నారు. గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇటు రేషన్ కేంద్రాల చుట్టూ.. అటు ఆధార్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు.

రేషన్​కార్డు లబ్ధిదారులకు సూపర్ న్యూస్​ - రేవంత్ సర్కార్​ కీలక నిర్ణయం! - Good News for Ration Card Holders

లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఈ-కేవైసీకి గడువును పొడగిస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా.. జూన్ 30 వరకు అవకాశం కల్పించారు. ఆలోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని లేదంటే రేషన్ సరుకులు పొందలేరని చెప్పారు. ఇటు చూస్తే ఆధార్ అప్డేట్ కాక జనాలు అవస్థలు పడుతున్నారు. అటు చూస్తే గడువు దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

కేవైసీ కాకపోతే ఏం జరుగుతుంది? తెలంగాణలో పాత డేటా ప్రకారం రేషన్ అందిస్తున్నారు. కానీ.. గడిచిన పదేళ్లలో చాలా మంది చనిపోయారు. అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోయారు. అబ్బాయిలు కూడా కొత్త కాపురాలు పెట్టారు. ఇన్ని మార్పులు జరిగినప్పటికీ.. రేషన్ పంపిణీ యథావిధిగా జరుగుతోంది. దీంతో.. అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు కేవైసీ చేయిస్తోంది. అయితే.. ఒకవేళ కేవైసీ చేయకపోతే రేషన్ కార్డులో పేరు తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. మళ్లీ తిరిగి పేరు చేర్చడం అన్నది అసాధ్యం కాకపోయినా.. అదో పెద్ద ప్రయాస అని మాత్రం చెప్పుకోవచ్చు. దీనికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. ఈ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అప్పటి వరకూ రేషన్ జాబితాలో పేరు ఉండదు. రేషన్ బియ్యం రాకపోవడమే కాకుండా.. ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి.. గడువులోగా కేవైసీ పూర్తి చేయించుకోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

పెన్షనర్లకు శుభవార్త - ఆరోజు నుంచే కొత్త పింఛను - మంత్రి కీలక ప్రకటన! - Latest Updates on Pensions in TS

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ - మంత్రి కీలక ప్రకటన! - New Ration Cards Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.