ETV Bharat / state

'ఖాతాదారులే దేవుళ్లు వారికి సేవ చేయడమే మన విధి' - రామోజీ తారకమంత్రం ఇదే - అందుకే మార్గదర్శి సక్సెస్ - MARGADARSHI CHITFUNDS STORY 2024 - MARGADARSHI CHITFUNDS STORY 2024

Ramoji Rao launched Margadarshi Chitfunds : బిందువు, బిందువు కలిస్తేనే మహాసాగరంగా మారేది. రూపాయి, రూపాయి పోగు చేస్తేనే రేపటి స్వప్నాల సాకారానికి బాటలు పడేది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతిరంగంలో అనితర సాధ్యమైన విజయాల్ని అందుకున్న రామోజీరావు తొలినాళ్లలోనే ఈ విషయం గుర్తించారు. బలంగా నమ్మారు. అదే స్ఫూర్తితో సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అందించాలనే సంకల్పంతో ప్రారంభించినదే మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌.

Ramoji Rao launched Margadarshi Chitfunds
Ramoji Rao launched Margadarshi Chitfunds (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 2:22 PM IST

Updated : Jun 8, 2024, 7:54 PM IST

'ఖాతాదారులే దేవుళ్లు వారికి సేవ చేయడమే మన విధి' - రామోజీ తారకమంత్రం ఇదే - అందుకే మార్గదర్శి సక్సెస్ (ETV Bharat)

Ramoji Rao launched Margadarshi Chitfunds : ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు? జీవితకాలంలో ఎన్ని లక్షలు, కోట్లమందిని ప్రభావితం చేయవచ్చు? క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో ఎంత ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అనడానికి ఈతరమెరిగిన స్ఫూర్తిశిఖగా నిలిచారు రామోజీరావు. ఈ క్రమంలో ప్రతిమనిషి జీవితంలో ఆర్థిక భద్రత, భరోసా ఎంత అవసరమో గుర్తించి, ఆ దిశగా అందరికీ వెలుగుబాట చూపే కాంతిస్తంభంగా ఆయన స్థాపించిన సంస్థ మార్గదర్శి చిట్‌ఫండ్స్.

ఆరు దశాబ్దాల వజ్రోత్సవ ప్రయాణంలో నమ్మకానికి చిరునామాగా ఆ సంస్థను తీర్చిదిద్దారు రామోజీరావు. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌ నాటి నుంచి నేటి వరకు అదే స్ఫూర్తితో కలలు మీవి, వాటికి సాకారం చేసే ఆర్థిక సహకారం మాది అంటూ నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది మార్గదర్శి.

LIVE UPDATES : అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది: వెంకయ్యనాయుడు - Ramoji Rao passed away

కచ్చితంగా చెప్పాలంటే 1962 అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు శ్రీకారం చుట్టారు రామోజీరావు. అప్పట్లో చిట్‌ల వ్యాపారం అంటే గృహిణుల వ్యాపారం అన్న అభిప్రాయాన్ని తిరగరాశారు. మొదట్లో ఎన్నో భిన్నాభిప్రాయాలు, ఆక్షేపణలు ఎదురైనా వెరవకుండా పట్టుదలతో చిట్‌ఫండ్ సంస్థను ముందుకు నడిపించారు రామోజీరావు. వసూళ్లు, చెల్లింపులు కచ్చితంగా ఉండడంతో అనతికాలంలోనే ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొన్నారు. పొదుపే పరమావధి అన్న సూత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావం, రాజీలేని యాజమాన్యం విశ్వసనీయతతో సంస్థ అంతే వేగంగా అభివృద్ధి చెందింది. కార్యకలాపాలు శరవేగంగా విస్తరించాయి. నమ్మకం అనే పునాదులపై చెక్కుచెదరని భవంతిగా వెలుగులీనుతోంది మార్గదర్శి.

అక్షర యోధుడి కోసం నడిచివచ్చిన అవార్డులు - eenadu chirman Ramoji Rao Received Awards

ఆరు దశాబ్దాలకు పైబడిన మహోజ్వల ప్రస్థానంలో చిన్నమొ‌త్తాల పొదుపుతో కలల్ని ఎలా సాకారం చేసుకోవచ్చో చెప్పడానికి మార్గదర్శిని ఉదాహరణగా నిలిపారు రామోజీరావు. ఆ కృషి ఫలితంగానే 1962లో హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో ఇద్దరు ఉద్యోగులు, ఒక చిన్న అద్దె గదిలో ప్రయాణం ప్రారంభించిన మార్గదర్శి ఇంతింతై అన్నట్లు రూ.10,687 కోట్లకు పైగా టర్నోవర్‌, 113 శాఖలు , 3లక్షలమందికి పైగా క్రియశీలక చందాదారులతో ఇప్పటికీ దినదిన ప్రవర్థమానమవుతునే ఉంది. 4,100 మంది ఉద్యోగులు, 18 వేలమందికి పైగా ఏజెంట్లతో జీవనోపాధినీ కల్పిస్తోంది మార్గదర్శి. ప్రభుత్వాలకి రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఆదాయపన్ను, జీఎస్టీ సహా వివిధపన్నుల రూపంలో వందల కోట్లు చెల్లిస్తోంది సంస్థ.

ఆపద సమయంలో బాధితులకు అండగా రామోజీ గ్రూప్​ - ఆపన్నహస్తంతో ఎన్నో కార్యక్రమాలు - Ramoji Rao Group Relief Funds

Margadarshi Chit Funds : మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఈ 62 ఏళ్ల విజయగీతికలో 60లక్షలమందికి పైగా చందాదారులు సంతృప్తికరమైన సేవలందుకున్నారు. ఇంటి నిర్మాణం, వ్యాపార ప్రారంభం, విస్తరణ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, చింతలేని పదవీవిరమణ జీవితం ఇలా అవసరమేదైనా అందరి ఏకైక ఎంపికగా నిలిచింది మార్గదర్శి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తరిస్తూనే ఉంది మార్గదర్శి. ఈ సంస్థ తోడుతో జీవిత లక్ష్యాలు సాధించుకున్న లక్షలాది ఖాతాదారుల మాదిరిగానే వేలాదిమంది ఉద్యోగ జీవితాన్ని మార్గదర్శిలో ప్రారంభించి సంతృప్తికరమైన వృత్తి జీవితం తర్వాత పదవీ విరమణ పొందారు. ఈ విజయం, నమ్మకం వెనకున్న ఒకేఒక్క స్ఫూర్తిప్రదాత రామోజీరావు.

ఖాతాదారులే దేవుళ్లు, వారికి సేవ చేయడమే మన విధి అన్న రామోజీరావు మాటనే తారక మంత్రం, విజయ సూత్రంగా చేసుకుని సుస్థిరవృద్ధిని సాధిస్తోంది మార్గదర్శి. భారతదేశ చిట్‌ఫండ్ వ్యాపారంలో దేశంలోనే నెంబర్‌-1 నిలిచింది మార్గదర్శి. ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు ఇలా అన్నివర్గాల వారినీ, అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్ష ణీయమైన పథకాలు, చిట్‌ గ్రూపులతో ఆరు తరాల ఖాతాదారులకు ఆత్మీయ మిత్రుడిగా నిలవడం అంటే ఆషామాషీ కాదు. పైగా మధ్యలో గిట్టనివాళ్లు కుట్రలు చేసినా, రాజకీయ మారీచులు యుద్ధం ప్రకటించినా నమ్మకమే ఊపిరిగా, శ్రీరామరక్షగా 62ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి ఫిర్యాదు లేకుండా ఖాతాదారులందరికీ ఐశ్వర్యానందాలు పంచుతోంది రామోజీరావు ప్రారంభించిన మార్గదర్శి సంస్థ.

రామోజీరావు అస్తమయం - మూగబోయిన నాగన్​పల్లి - Ramoji Foundation Adopted Naganpally Village

Last Updated : Jun 8, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.