Ramasamudram In Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో రామసముద్రం (Ramasamudram) ఒక కుగ్రామం. సుమారు 120 సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యవసాయ భూములు కలిగి ఉన్న 32కు పైగా కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. సొంత ఇళ్లు, భవనాలు నిర్మించుకున్నారు. గ్రామంలోని నూరుశాతం వ్యవసాయం, పాడి పైనే ఆధారపడుతూ జీవనం సాగించేవారు. నిత్యం పాలను సమీపంలోని ఆలేరుకు తీసుకువచ్చి అమ్ముకునేవారు. 2000 సంవత్సరంలో మాబడి పథకంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిధులతో సొంత భవనం కూడా నిర్మించారు. దశాబ్దకాలం పాటు పాఠశాల చక్కగా నడిచింది.
'బాగు కోసం ఊరు వదిలేస్తే - ఉన్న ఉపాధినీ దూరం చేశారు - మమ్మల్ని ఆదుకోండయ్యా'
Ramasamudram : 2005 నుంచి వరుసగా ఏర్పడిన కరవు పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ బావులు ఎండిపోవడంతో ఒక్కో కుటుంబం బతుకు దెరువు కోసం ఆలేరు, జనగామ, హైదరాబాద్ (Hyderabad) నగరాలకు వలస పోయాయి. గ్రామంలో రెండు ఇళ్లు మినహా మిగతా ఇళ్లన్నీ కూలిపోయాయి. గ్రామంలోని నీటి ట్యాంకు వృథాగా మారింది. సామాజిక భవనం శిథిలమై పోయింది. వీధుల్లో కంపచెట్లు పెరిగాయి. నాడు కళకళలాడిన రామసముద్రం నేడు కళా విహీనంగా మారింది. చుట్టు పచ్చని పొలాలు, స్వచ్చమైన గాలి ఆహార్లదకరమైన వాతావరణం మధ్య కూలిపోయిన ఇళ్లు, కంప చెట్లతో ఊరంతా పడావుగా మారిపోయింది.
ఇది హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారికి అతి సమీపంలో ఆలేరు మున్సిపాలిటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా రామసముద్రం. ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం, పాల ఉత్పత్తిప్తె ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 32 కుటుంబాలు ఉండేవారు. ప్రతి ఇంటికి పచ్చని పందిర్లు చుట్టూ పొలాలతో కళకళలాడుతూ కనిపించేదని గ్రామస్థులు అంటున్నారు.
పక్షుల కోసం దీపావళి ఆనందం త్యాగం- 50 ఏళ్లుగా ఆ ఊర్లో ఇంతే!
"ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం, పాల ఉత్పత్తిప్తె ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 32 కుటుంబాలు జీవనం ఉండేవి. ఇంటింటికీ పచ్చని పందిర్లు, చుట్టూ పొలాలతో కళకళలాడుతూ కనిపించేది. చుట్టాలు వస్తే ఈ వాతావరణానికి ముగ్దుల్తె మూడు నాలుగు రోజులు కూడా ఇక్కడే ఉండే వారు. వందేళ్ల చరిత్ర కల్గిన ఈ గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాలు, మంచి నీటి ట్యాంక్ కూడా నిర్మించింది. కానీ అవి కూడా నిరుపయోగంగా పడావు పడి ఉన్నాయి." - గ్రామస్థులు
రామ సముద్రంకు రామ్ రాం చెప్పిన గ్రామస్థులు : వందేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామానికి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాలు, మంచి నీటి ట్యాంక్ కూడా నిర్మించింది. అయితే ఆలేరును రామసముద్రం గ్రామాన్ని విడదీస్తూ మధ్యలో హైదరాబాద్-హన్మకొండ హైవే రావడంతో గ్రామస్థులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. నిత్యం రాకపోకలు సాగించాలంటే ప్రమాదాలకు గురికావడం, స్కూల్ పిల్లలు, వృద్దులు, గీతా కార్మికులు, మహిళలకు రోడ్డు దాటలంటేనే శాపంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు.
భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లిన భర్త- అంబులెన్స్ ఇవ్వలేదని!!