ETV Bharat / state

పలు ప్రాంతాల్లో వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Rain in Andhra Pradesh 2024

Rain in Andhra Pradesh 2024 : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

rains_in_ap
rains_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 12:19 PM IST

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు - లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం (ETV Bharat)

Rains in Andhra Pradesh 2024 : రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి. కోనసీమ ప్రాంతాల్లో తెల్లవారుజామున నుంచి కుండపోత వర్షం కురసింది. అమలాపురంతో సహా పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. గుంతల రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రహదారులు గంతలమయంగా మారాయని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారి కావడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

భారీ వాహనాలు ప్రయాణించడంతో రహదారులు మరింత అద్వానంగా తయారవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నూతన రహదారిని నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం- విరిగిన కొండచరియలు, స్తంభించిన జన జీవనం - rain updates

NTR District : ఎన్టీఆర్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదార్లపైకి నీరు చేరింది. వాహనదారులు, ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. జిల్లా అంతటా దాదాపు వర్షాలు కురుస్తున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెవిటికల్లు బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది.

తిరువూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు,వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ వాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద రహదారిపై నుంచి కట్లేరు వరద ప్రవాహం పెరిగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బైపాస్ రోడ్డు జంక్షన్ నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. రెండు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీటిలో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరింది. తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో భారీ వర్షానికి వరదనీరు ఇళ్లల్లోకి చేరింది.

గోదావరి వరద ముంపులో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు - People Suffer in FLOOD WATER

YSR District : కడపలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం మొత్తం నీళ్లు చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలానే కోర్టు , వై జంక్షన్‌, అక్కయపల్లి, గంజికుంట తదితర కాలనీల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. మురుగు కాలువ నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వీడని వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు - Flood Effect in Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.