Purandeswari Started Gaon Chalo Abhiyan Program in Vijayawada : బీజేపీ ఆధ్యర్యంలో 'గావ్ చలో' అభియాన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. పొత్తుల విషయం గురించి అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని వివరించారు. పొత్తుల సంగతి కాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. జిల్లాల అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. కాబట్టి ప్రజల వద్దకు వెళ్లడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని పురందేశ్వరి అన్నారు.
అప్పులు చేస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు: పురందేశ్వరి
రోడ్లు, వైద్య కళాశాలలు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అన్నింటికీ కేంద్రం నిధులనే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఒక్కటీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రకరకాల కారణాలతో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిస్తున్నారో తెలపాలన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఒక్కో పేద లబ్ధిదారునికి ఐదు కేజీల బియ్యం కేంద్రం ఇస్తోందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం కూడా ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని ఆరోపించారు.
AP BJP Chief Criticized to CM Jagan : దేశమంతా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను పండుగలా చేసుకున్నారని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇవ్వకుండా పిల్లలకు చూసే అవకాశం చేజార్చిందని విమర్శించారు. ఓటరు జాబితాల్లో చాలా అవకతవకలు జరిగాయని పురందేశ్వరి ఆరోపించారు. వైనాట్ 175 నినాదం వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధికి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారని, విచారణకు ఆదేశించారని తెలిపారు. ఇది బీజేపీ సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు.
'ఇసుక, మద్యం పాలసీతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీ.. సామాన్యుల జీవితాలు ఛిన్నాభిన్నం'
రాష్ట్రంలో వాలంటీరు ద్వారా ఓటు వేయిస్తే తాము అభ్యంతరం చెబుతామన్నారు. అధికార పార్టీ అభ్యర్ధుల స్థానాలు మారుస్తున్నారని, వారితోపాటు వారి మద్దతు ఓటర్ల జాబితాలూ మారుస్తున్నారని విమర్శించారు. వేల కొద్ది కొత్త ఓట్లను వేరే నియోజకవర్గాల్లో నమోదు చేస్తున్నారని దీన్ని బీజేపీ ఆక్షేపిస్తోందన్నారు. ఓటు మార్చుకునే అవకాశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వేరే నియోజకవర్గాల్లో కొత్త ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలను అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఒత్తిళ్లకు గురిచేసి భయపెట్టి లబ్ధి పొందాలనుకుంటోందన్నారు. ఇలాంటి అన్ని అక్రమాలపైనా ప్రజలకు గ్రామాల్లో పర్యటించి వాస్తవాలు వివరించాలని పార్టీ నేతలకు పురందేశ్వరి సూచించారు.
ఓటర్ల జాబితాలో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది. దొంగ ఓట్లతో లబ్ధి పొందేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో 35 వేల దొంగ ఓట్లు వేయించారు: -పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
Purandeshwari Comments on Fake Votes: ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం కమిటీలు: పురందేశ్వరి