ETV Bharat / state

రాజమహేంద్రవరంలో పురందేశ్వరి భారీ రోడ్​షో - ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపు - PURANDESWARI ROAD SHOW - PURANDESWARI ROAD SHOW

Purandeshwari Road Show : ఎన్నికలు దగ్గరపడటంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్​షో నిర్వహించారు. పురందేశ్వరి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

Purandeshwari Road Show
Purandeshwari Road Show (ETV BHARAT)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 9:53 PM IST

Purandeshwari Road Show : ఎన్నికలు దగ్గరపడటంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కూటమి ప్రకటింటిన మేనిఫెస్టోని అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్​షో నిర్వహించారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. రోడ్​షోలో పురందేశ్వరితో పాటు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఇరువురు నేతలు నిడదవోలు, పెరవలి మండలాలలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ప్రారంభమైన రోడ్​షో రావి మెట్ల, తాడిమళ్ల, తిమ్మరాజుపాలెం మీదుగా కడింపాడు వరకు కొనసాగింది.

కూటమి మేనిఫెస్టోతో జోరుగా ప్రచారం - వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు

ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు : ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. దానిని నిరసిస్తూనే ప్రజలు ఈ రక్షాస ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్​లకు, మాఫియా దందాలకు రాజమహేంద్రవరం పెట్టింది పేరని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా వల్ల ఇసుక ధరలు పెరిగిపోయి నిర్మాణ రంగంమీద ఆధారపడి బతుకుతున్న 35 లక్షల మంది రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో అన్ని రకాల సమస్యలు గుర్తించామని తెలిపారు. వీటన్నింటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు.

ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి : గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంత నాశనం అయ్యిందో అందరికీ తెలుసన్నారు. సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుతున్నామని చెప్పే జగన్ మోహన్ రెడ్డి ఎంత నొక్కుతున్నాడో అందరికి చెబితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లు రాష్ట్రానికి కేటాయిస్తే వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించలేదని విమర్శించారు. ఇటువంటి ప్రజా కంటక పాలన ప్రభుత్వన్ని ఇంటికి సాగనంపడానికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించవలసిన బాధ్యత ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు.పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి కూటమికి అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.

జోరుగా సాగుతున్న కూటమి నేతల ప్రచారం - అడుగడుగునా జననీరాజనం - Lok Sabha elections 2024

సూపర్ స్పీడ్​తో దూసుకుపోతున్న కూటమి నేతలు - ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు

ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి భారీ రోడ్​షో - ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపు (ETV BHARAT)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.