Protest Against Krishnapatnam Port Container Terminal Closing: కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేతకు సన్నాహాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పోర్టు మూసివేస్తే దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులు వీధిన పడుతారని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ట్రాన్స్ పోర్టు, సీహెచ్ఎస్, కష్టమ్స్ క్లియరెన్స్ విభాగాల్లో పనిచేస్తున్నవారు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణపట్నం పోర్టు(Krishanapatnam Port)లో ఛార్జీలు, ట్యారిఫ్‌లు కూడా పెంచి కంటైనర్ల రవాణాకు బయట పోర్టులకు వెళ్లే విధంగా ఏడాది నుంచి అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంటైనర్ టెర్మినల్‌ను తమిళనాడు(Tamilanadu)కు తరలిస్తూ కృష్ణపట్నంలో మాత్రం కేవలం బొగ్గు(coal), బూడిద రవాణాకే పరిమితం చేస్తున్నారన్నారు. బొగ్గు, ఐరన్ ఓర్‌తో డర్టీ కార్గోగా పోర్టును మారిస్తే నెల్లూరు(Nellor) జిల్లాలో కాలుష్యం పెరుగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణపట్నం పోర్టుకు ఖాళీ కంటైనర్ల వెజల్ తీసుకువచ్చి డ్రామాలాడుతున్నారు- టీడీపీ నేత సోమిరెడ్డి
దిగుమతి, ఎగుమతులతో భారీగా లాభాలు సంపాదించి పెట్టిన ఈ పోర్టును అదానీ(Adani) సొంతం చేసుకున్న తర్వాత నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చే కంటైనర్లను దారి మళ్లించి ఇక్కడి ఎగుమతులు, దిగుమతులను తమిళనాడులోని అదానీకి చెందిన కాటుపల్లి(Katupalli), ఎన్నూరు పోర్టులకు క్రమంగా మార్చేశారని ఆరోపించారు.
జనవరి నుంచి పోర్టులో కంటైనర్లు తగ్గించేశారని, దీంతో కృష్ణపట్నం పోర్టును నమ్ముకున్న కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే కంటైనర్స్ ఖాళీ చేసి లాభాల్లో ఉన్న కృష్టపట్నం పోర్టును మూసివేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కృష్ణపట్నం పోర్టు తరలింపుపై కార్మికుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నా ఈ చర్యను పట్టించుకోవడంలేదని, భవిష్యత్‌లో పోర్టు నుంచి బల్క్ కార్గో ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతుందని తెలిపారు. దీనిపై పోర్టు కార్మిక సంఘాలు, పరిశ్రమల ఉద్యోగులు, టీడీపీ(TDP), సీపీఐ(CPI), సీపీఎం(CPM) నేతలు తరచూ ధర్నాలు చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. పోర్టులో కంటైనర్ల రవాణాకు యాజమాన్యం అనుమతి నిరాకరిస్తున్నా మంత్రి కాకాణి(Minister Kakani) కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
"కుట్రతో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేతకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోర్టు మూసివేస్తే దీనిపై ఆధారపడి జీవిస్తున్న 10వేల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. కంటైనర్ టెర్మినల్‌ను తమిళనాడుకు తరలించారు. దిగుమతి, ఎగుమతులతో భారీగా లాభాలు సంపాదించి పెట్టిన ఈ పోర్టును అదానీ సొంతం చేసుకున్న తర్వాత నిర్వీర్యం చేశారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చే కంటైనర్లను దారి మళ్లించి తమిళనాడులోని అదానీకి చెందిన కాటుపల్లి, ఎన్నూరు పోర్టులకు క్రమంగా తరలించేశారు." - ఆనందకుమార్, కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగి
కృష్ణపట్నం పోర్టు కూడా తరలిపోతే రాష్ట్రానికి మిగిలేది బొగ్గు, బూడిదే : సోమిరెడ్డి