Protection of Minority Rights Committee Press Meet : మానవ హక్కుల కమిషన్ ఎదుటే హక్కులు ఉల్లంఘించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కమిషన్ సాక్షిగా ప్రజల హక్కులను పోలీసులు, అధికారులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మానవ హక్కుల కమిషన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
'రాబోయే ఎన్నికల్లో టీడీపీకే మా మద్దతు' - మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏకగ్రీవ తీర్మానం
ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మరియు సమతా సైనిక్ దళ్ నాయకులు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకుని అక్కడ ఉండడానికి వీలు లేదంటూ పంపించి వేశారన్నారు. మానవ హక్కుల కమిషన్ కేటాయించిన సమయానికి వారిని కలవడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు.
Minority Rights Committee in AP : వారి హక్కులను కాలరాస్తూ పోలీసులు, అధికారులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇది ఒక నిదర్శనమని తెలిపారు. సాక్ష్యాత్తు మానవ హక్కుల కమిషన్ ముందే ప్రజల హక్కులను కాలరాయడం దారుణమన్నారు. మార్చి 8వ తేదీన రాజమండ్రిలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఫరూక్ షిబ్లీ వెల్లడించారు.
అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంత బాబును తక్షణమే అరెస్టు చేసి సీబీఐ విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు, కార్యదర్శులు డిమాండ్ చేశారు. వీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని బయటకు రాకుండా వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుని మండిపడ్డారు. తక్షణమే సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"మైనార్టీ దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు"
ఎమ్మెల్సీ అనంత బాబు మాఫియా సామ్రాజ్యం వివరాలన్నీ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి తెలుసు. అందువల్లే హత్య చేసి ఉంటారని అనుమానం కలుగుతుందని నాయకులు వెల్లడించారు. నిందితుడు రాష్ట్రంలో గంజాయి సరఫరా చేస్తూ నాయకులకు కమిషన్లు పంపుతున్నారని విమర్శించారు. దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు రాష్ట్రంలో ఉంటున్నాయన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించి అనంత బాబుపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.