ETV Bharat / state

సామాన్యుల జీవితాలు తెలిపేలా ఛాయాచిత్ర ప్రదర్శన - ఆకట్టుకుంటున్న ఎవ్రీడే ఇండియా ఫొటోగ్రఫీ షో - Every Day India Exhibition

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 11:59 AM IST

Updated : Aug 16, 2024, 12:18 PM IST

Every Day India Art Gallery : హైదరాబాద్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఎవ్రీడే ఇండియా పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు హరగోపాల్‌, కోదండరాం పాల్గొని ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.

Every Day India Photo Exhibition in Hyderabad
Every Day India Art Gallery (ETV Bharat)

Every Day India Photo Exhibition in Hyderabad : దేశమంటే మతం రాజకీయమే కాదని, మట్టి, మనుషులు కూడా అని చెప్పడానికి ఎవ్రీ డే ఇండియా పేరుతో ఫొటోగ్రఫీ షో ప్రారంభించామని ప్రముఖ జర్నలిస్టు ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు అన్నారు. హైదరాబాద్​లోని స్టేట్‌ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీ డే ఇండియా పేరిట ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రొఫెసర్​ హరగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుల నిత్య జీవితాన్ని అందరికీ తెలిసే ఉద్దేశంతో 60 ఫొటోలను హైదరాబాద్ స్టేట్‌ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచామని రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రదర్శన ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం కథలు, నవలలు రాసేవారు ఉన్నారని, కానీ ఫొటోగ్రఫీ ద్వారా కథ రాసేది మాత్రం చాలా అరుదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

'మనుషుల అనుభవాలు ముఖాల్లో కనిపిస్తున్నాయి. వాళ్ల భావోద్వేగాలు కూడా ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూడగానే చెప్పదల్చుకున్న వివరణ, విషయం అవసరం లేకుండా అర్థమవుతోంది. ఛాయాచిత్రాలు చాలా బాగుంది'- ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

సామాన్యుల జీవితాలు తెలిపే ప్రదర్శన : చిత్రాలు భావాల్ని సజీవంగా ఉంచుతాయని, వాటి నుంచే భాష అభివృద్ధి చెందిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మనుషుల అనుభవాలు ముఖాల్లో కనిపించేలా తీసిన చిత్రాలు ఎన్నో భావాలను చెబుతున్నాయని కోదండరాం అన్నారు. ఒక్కో ఫొటో ఒక కథ చెబుతోందని, ఒక్క నిమిషం వీడియో కన్నా ఒక చిత్రం ఎన్నో విషయాలు చెబుతోందని అన్నారు. శ్రామిక జీవన సౌందర్యాన్ని అద్దం పట్టే ఎన్నో అపురూప చిత్రాలు ఇక్కడ కొలువు తీరాయని వివరించారు.

'ప్రముఖులను కాకుండా సామాన్యుల జీవితాలను నేను సెలబ్రిటీ​గా చేస్తూ ఉంటాను. నేను ఇండియా అనకుండా ఎవ్రీడే ఇండియా అనే ఉద్దేశం ఏంటంటే నిత్య జీవితం, నిత్య భారతం సాధారణ భారతం. సామాన్య జీవితాన్ని ఎత్తిచూపడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశా'- రమేష్ బాబు, ఫొటోగ్రాఫర్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన - Bhupalpally Man Photo on New York

World Photography Day 2023 : మాదాపూర్​లో ఫొటో ఎగ్జిబిషన్​.. ఆ అద్భుతాలపై మీరూ ఓ లుక్కేయండి..

Last Updated : Aug 16, 2024, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.