Private Degree Colleges Management Association Agitation : రాష్ట్రంలో దాదాపు 700 కళాశాలలు బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు నిర్వహిస్తున్నాయని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కోర్సుల నిర్వహణకు కోసం యూనివర్సీటీలు, స్టేట్ కౌన్సిల్ వద్ద అనుమతి తీసుకుంటే సరిపోతుందని ఇప్పడు ఏఐసీటీఈ అనుమతి కూడా తీసుకోవాలని తమపై ఒత్తిడి తీసుకురావడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర నలుమూల నుంచి అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని, డిగ్రీ కళాశాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. కానూరు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల వరకు సాగింది. ర్యాలీ ఆనంతరం కళాశాల్లో సమర భేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు రమణాజీ, గుండారెడ్డి మాట్లాడుతూ ఏఐసీటీఈ విధిస్తున్న నిబంధనలు డిగ్రీ కళాశాలకు ప్రాణ సంకటంగా మారాయని వాపోతున్నారు.
ఒక్క బీబీఏ కోర్సుతో కళాశాలను ఏర్పాటు చేయాలంటే 20 వేల అడుగుల విశాలమైన భవనం కావాలని, సంవత్సరానికి లక్ష 25 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెబుతున్నారని చెప్పారు. అలాగే ఫిక్సిడ్ డిపాజిట్ కూడా చేయాలని అంటున్నారు, ఒక్క కోర్సుకే దాదాపు కోట్ల రుపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, వారు తమ పరిధిలోది కాదని చెప్పారని వివరించారు. తాము చేస్తున్న పొరాటానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.
Best Course For Students: ఏ కోర్సు ఎంచుకోవాలి అనే గందరగోళానికి చెక్ పెట్టండి ఇక..
రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ ఫీజులతో 700 కాలేజీల్లో ఈ కోర్సులు విద్యార్ధులకు భోదిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు గంధం నారాయణరావు, వెంకట్ రెడ్డి, సురేంద్రర్ రెడ్డి తెలిపారు. కోర్సుల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 26 లోపు కళాశాలల నుంచి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వాపోతున్నారు. ఏఐసీటీఈ విధిస్తున్న నిబంధనలు పాటిస్తూ గ్రామీణ ప్రాంతాలో ఈ కోర్సులను నిర్వహించడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు.
ఇంజినీరింగ్‌లో ఫీజుల అలజడి.. ఏఐసీటీఈ సిఫార్సులపై సర్కార్ తర్జనభర్జన
రానున్న రోజుల్లో డిగ్రీ కోర్సులను కూడా ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పేద విద్యార్ధులకు ఫ్రోఫెషనల్ కోర్సులు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. డిగ్రీ విద్యలో ప్రభుత్వం కోరుకున్నట్లుగా జీఆర్ఈ రేషియో పెరగక పోగా తీవ్రంగా తగ్గే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.