ETV Bharat / state

'బిల్వస్వర్గం గుహల్లో' వైఎస్సార్సీపీ విధ్వంసకాండ - 26 లక్షల ఏళ్ల నాటి చరిత్ర ధ్వంసం - BILVA SWARGAM CAVES SITUATION

అతి పురాతన చరిత్రకు నిలువెత్తు నిదర్శం బిల్వస్వర్గం గుహలు - ఎలుక నుంచి ఖడ్గమృగం వరకు అనేక జంతువుల అవశేషాలు లభ్యం - పురాతన ఆనవాళ్లను పూర్తిగా సిమెంట్‌తో కప్పేసిన గత పాలకులు

YSRCP Government Neglected Bilva Swargam Caves in Nandyal District
YSRCP Government Neglected Bilva Swargam Caves in Nandyal District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2024, 7:23 PM IST

YSRCP Government Neglected Bilva Swargam Caves in Nandyal District : మహోజ్వల చరిత్రకు సాక్షీభూతమైన గుహలు గత పాలకుల అనాలోచిత నిర్ణయంతో ప్రమాదంలో పడ్డాయి. లక్షల ఏళ్ల నాటి చరిత్రను చాటిచెప్పే తవ్వకాలను సిమెంటుతో కప్పేయడం పరిశోధకులను, పర్యాటకులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. విధ్వంసమే అజెండాగా సాగిన వైఎస్సార్సీపీ పాలనలో బిల్వస్వర్గం గుహల విశిష్టతను ఎలా నాశనం చేశారో తెలుసుకోవాలంటే నంద్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.

నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకిందకొట్టాల గ్రామ సమీపంలో బిల్వసర్గం గుహలు ఉంటాయి. మద్రాస్ ఆర్మీకి చెందిన కెప్టెన్ న్యూబొల్డ్ 1844లో లండన్‌ రాయల్ సొసైటీకి ఇచ్చిన సమాచారంతో ఈ గుహల ప్రాధాన్యం తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ-హిస్టరీగా పిలుచుకునే రాబర్ట్ బ్రూస్ ఫూట్ 1883లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్‌గా పని చేశారు. బ్రిటిష్ అధికారుల ప్రోత్సాహంతో కుమారుడు బ్రూస్ ఫూట్ జూనియర్‌తో కలిసి 1883 - 1885 మధ్య ఈ గుహల్లో తవ్వకాలు చేపట్టారు.

ఎర్రమలగుహల్లో ఆదిమానవుడి పెయింటింగ్స్ - దాచేస్తున్న మైనింగ్ మాఫియా

26 లక్షల ఏళ్ల నాటి అవశేషాలు : ఎలుక నుంచి ఖడ్గమృగం వరకు అనేక జంతువుల అవశేషాలను వెలికితీసి కోల్‌కతాలోని ఏసియాటిక్ సొసైటీకి పంపారు. జంతువుల అవశేషాలు 26 లక్షల ఏళ్ల నాటివిగా పరిశోధకులు గుర్తించారు. అక్కడే మధ్యరాతియుగపు మానవుల ఆనవాళ్లను సైతం కనుగొన్నారు. పూర్తిస్థాయి సర్వే చేసి చక్కటి మ్యాప్‌ రూపొందించిన బ్రూస్ ఫూట్, ఒక్కో భాగానికి ఒక్కో పేరు కూడా పెట్టారు. అప్పట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసి తర్వాత బ్రిటిష్ మ్యూజియం పురావస్తు శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టిన రిచర్డ్ లిడెకర్ బిల్వసర్గం గుహల ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తం కావడానికి కారకులయ్యారు. అనంతరం 1920లలో కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన LA. కామియాడ్ ఆధార సహితంగా గుహల విశేషాలను వెలుగులోకి తెచ్చారు. తర్వాతి కాలంలో ఆల్చిన్ దంపతులు, KN ప్రసాద్, MLK మూర్తి, K. తిమ్మారెడ్డి లాంటి పరిశోధకులు గుహల నిర్మాణం, జంతుజాలం, ఆదిమానవుల ఆనవాళ్లపై అధ్యయనం చేశారు.

బిల్వసర్గం గుహల్లో పరిశోధనలు : ఇటీవల కాలంలో అంతర్జాతీయ పరిశోధకులు, ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రవి కొరిశెట్టర్ ఆధ్వర్యంలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, గ్రిఫిత్, క్వీన్స్‌లాండ్ వర్సిటీలకు చెందిన వివిధ రంగాల శాస్త్రవేత్తలు, నిపుణులు అధ్యయనం చేశారు. 2003 నుంచి 2010 వరకు బిల్వసర్గం గుహల్లో పరిశోధనలు నిర్వహించారు. ఆఫ్రికా ఖండం వెలుపల భారతదేశంలోని ఈ ప్రాంతంలోనే మొదటిసారిగా పురాతన మానవ జాతుల ఆధారాలు లభ్యమయ్యాయి. ఇంతటి చరిత్ర ఉన్న ఈ గుహలను వైఎస్సార్సీపీ హయాంలో ఆనవాళ్లు లేకుండా చేశారు. అప్పటి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గొప్పల కోసం ఏమాత్రం అవగాహన లేకుండా పురాతన ఆనవాళ్లను సిమెంట్‌తో కప్పేశారు. ఆధునిక పద్ధతుల్లో చేపట్టిన ట్రెంచ్‌లను కాంక్రీట్ మయం చేశారు. ఇప్పటికైనా ఈ గుహలను పరిరక్షించాలని పరిశోధకులు కోరుతున్నారు.

"గుహల్లో పరిశోధనలు చేసినప్పుడు వాటిని కాపాడాలని స్థానిక అధికారులను కోరాం. లైమ్‌స్టోన్‌ క్వారీయింగ్‌తో గుహలు దెబ్బతినకుండా చూడాలని విన్నవించాం. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ట్రెంచ్‌లను కాంక్రీట్‌తో కప్పేశారు. గుహ భాగమంతా సిమెంట్‌తో నింపేశారు. దీనివల్ల తదుపరి పరిశోధనలకు అవకాశం లేకుండా పోయింది. అక్కడ పూడ్చివేసిన ట్రెంచ్‌లు, గుంతలను తిరిగి తవ్వి తీయాలని అధికారులను కోరాం. దానివల్ల మళ్లీ పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. అలా చేస్తే చారిత్రక ఆనవాళ్లు కాపాడేందుకు కృషి చేసినట్లే." - పరిశోధకులు

చరిత్రను చెరిపేసి ఏదో ఘనకార్యం చేసినట్లు ఈ ఏడాది జనవరి 29న పర్యాటకులకు అనుమతించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుహల చెంత కనీస సదుపాయాలూ కల్పించలేదు.

చరిత్ర సాక్ష్యాలుగా మొగల్రాజపురం గుహలు - వారి ఆవాసం కోసం నిర్మించినవేనా?

మామిడి చెట్లు తొలగిస్తుండగా బయటపడిన భారీ సొరంగం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు - Huge Tunnel In Mango Farm

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.