Pregnant Woman Suspicious Death in Nandyal: నంద్యాల జిల్లాలో వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలైంది. అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మార్చురీలో పడి ఉన్న తమ బిడ్డను చూసుకుని తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. తమ బిడ్డ మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళన నిర్వహించారు. కనికరం లేకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని పోలీసులు బాధితులను అరెస్టు చేయాలని బంధువులు ఆందోళన చేశారు.
Dowry Harassment : ఆరోగ్యం బాగోలేదని మీ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లామని అత్తింటి వారు చెప్పడంతో మహిళ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తమ కూతురు విగతజీవిగా పడి ఉండటంతో వారి రోదనలు మిన్నంటాయి. వరకట్నం కోసమే అత్తింటి వారు తన కూతురిని వేధించి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు.
వాటర్ హీటర్ స్వీచ్ వేస్తుండగా కరెంటు షాక్- మహిళ మృతి
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సంజీవనగర్‌కు చెందిన బాలాజీ నాయక్, రత్నాలు బాయిల కుమార్తె శిరీషకు 8నెలల క్రితం కర్నూలుకు చెందిన రైల్వే ఉద్యోగి శ్రీకాంత్‌తో వివాహం జరిగింది. శ్రీకాంత్ తండ్రి తిరుపాల్ నాయక్ ఏఎస్ఐగా పని చేస్తున్నారు. 6నెలల గర్భవతి అయిన శిరీషకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తరలించారన్న సమాచారంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా విగతజీవిగా మార్చురీలో ఉండటం చూసి బోరున విలపించారు. ఆసుపత్రిలో భర్త, అత్తమామలు కనిపించకపోవటంతో శిరీష కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
"వరకట్నం కోసం శిరీషని ఎక్కువగా వేధించేవారు. 6నెలల గర్భిణీ అని చూడకుండా చిత్రహింసలు పెట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. బాధితులను కఠినంగా శిక్షించి మా చెల్లెలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం".- శైలజ, శిరీష సోదరి
శిరీష ముక్కులోంచి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. పెళ్లి సమయంలో రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధించటంతో రూ. 5 లక్షల నగదు ఇచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. అదనంగా నగదు తీసుకురావాలని అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, తమకు న్యాయం చేయాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు నిర్ధాక్షిణ్యంగా బాధితురాలి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించారు. శిరీష మామ తిరుపాల్ నాయక్ పోలీస్ కావటంతో తమపైనే దాడి చేసి అరెస్టు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి
Family Members Concern at Kurnool Collectorate: మృతదేహాన్ని తీసుకెళ్లమని పోలీసులు చెబితే ఇక్కడే అంత్యక్రియలు జరపాలని మృతురాలి తల్లిదండ్రులు పట్టుబట్టారు. తమ కుమార్తెను భర్త, అత్తమామలు వేధించి చంపేశారని తల్లిదండ్రులు బాలాజీ నాయక్, రత్నాలు ఆరోపించారు. బుధవారం ఉదయం తమకు ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో అనుమానం వచ్చిందన్నారు. తమ కుమార్తె ముఖంపై గాయాలతో విగతజీవిగా కనిపించిందన్నారు. వేధింపులతోనే కుమార్తె చనిపోయిందంటూ కుటుంబ సభ్యులందరూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కారకులను శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశంతో బాధితులను పక్కకు తొలగించేందుకు ప్రయత్నించారు. వారు వినకపోవడంతో పోలీసు వాహనంలో తరలించేందుకు సిద్ధమయ్యారు.