Prathidwani Debate on 2018 Group1 Mains Exam Issue: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియమకాలు జరిపే రాజ్యాంగబద్ధ సంస్థ ఏపీపీఎస్సీ. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ మొదలుకుని వీఆర్‌ఏ వరకు నియమకాలన్నీ ఈ సంస్థ చేతుల మీదుగానే జరుగుతాయి. మరి అలాంటి సంస్థ ఎంత పకడ్బందీగా ఉండాలి? నియామకాలు ఎంత పారదర్శకంగా జరగాలి? కానీ వైసీపీ పాలనలో ఏపీపీఎస్సీ పనితీరు పూర్తిగా భ్రష్టుపట్టింది.
తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వైసీపీ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసారని విమర్శలు ఎదుర్కుంటోంది. దీనిపై నిరుద్యోగ యువత, యువజన సంఘాలు ఏం అంటున్నాయో ఈరోజు తెలుసుకుందాం. నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.రామన్న పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏం చేశారని జగన్ పార్టీకి దళితులు ఓటేయాలి ?
2018 గ్రూప్1 మెయిన్స్ రద్దు కేసు పూర్వాపరాలు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018 డిసెంబర్ 31వ తేదీన 169 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత వైసీపీ సర్కార్ ఈ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. అయితే అప్పటి ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్‌ను పక్కన పెట్టి, పీపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్ ఆంజనేయులు, సభ్యులు కలిసి పేపర్ వ్యాల్యూషన్‌ను డిజిటల్ మూల్యాంకనం చేశారు. దీనిపై నోటిఫికేషన్లో పొందుపరచకపోవటంతో దీనిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ అప్పటి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
2018 గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కోర్టులో వ్యాజ్యాలు వేశారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాంకనంలో వారిలో 202 మందిని అనర్హులుగా నిర్ణయించిందని కోర్టుకు నివేదించారు. జవాబుపత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు.
జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?
2018 గ్రూప్1 మెయిన్స్‌పై హైకోర్టు కీలక తీర్పు: ఈ వ్యాజ్యాలపై పలు దశల్లో విచారణ జరిపిన హైకోర్టు 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి వైసీపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ న్యాయబద్ధంగా లేవని స్పష్టంచేసింది. ఈ క్రమంలో మెయిన్స్ అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దుచేసింది.
మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయని పేర్కొంది. నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయడంలో ఏపీపీఎస్సీ, ప్రభుత్వం విఫలమయ్యాయని తేల్చిచెప్పింది. జవాబుపత్రాలను చేత్తో దిద్దాలని హైకోర్టు ఆదేశించాక ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం మరిన్ని అవకతవకలకు పాల్పడ్డాయని పేర్కొంది. ఈ అవకతవకలే ఎంపిక ప్రక్రియ చట్టబద్ధతను వేలెత్తి చూపడానికి కారణం అయ్యాయని స్పష్టం చేసింది. రెండు, మూడుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేయడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొని నచ్చినవారిని ఎంపిక చేసే అవకాశం ఉందంది.
రెండోసారి, మూడోసారి మూల్యాంకనం జరిగిందనేందుకు అనేక ఆధారాలు కనిపిస్తున్నా ఎందుకు ఏపీపీఎస్సీ ఇంకా ఈ విషయంలో బుకాయిస్తోంది? హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్వ్యూ పూర్తయిన శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరిన వారి భవిష్యత్ ఏంటి? గ్రూప్ వన్‌లో ఒక్కో ఉద్యోగాన్ని కోటిన్నర రూపాయలకు అమ్ముకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది ఆ వివరాలేంటి? గ్రూప్ వన్ వివాదం విషయంలో వైసీపీ సర్కారు చివరకు కోర్టుకు కూడా తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిందని విపక్షం ఆరోపిస్తోంది. చివరకు కోర్టులకు కూడా తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? అనే అంశాలపై వక్తలు తమ అభిప్రాయాలను తెలిపారు. దీనికి సంబంధంచిన పూర్తి కార్యక్రమం కోసం పైన ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?